నేడు మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటం బాధితులకు ఆర్ధిక సాయం అందజేసిన పవన్ మాట్లాడుతూ..2024లోవైసీపీ ఎలా గెలుస్తుందో నేను చూస్తాను. 175కు 175 సీట్లు గెలుస్తుంటే నోట్లో వేలు పెట్టుకొని చూస్తామా అన్నారు. 2024 ఎన్నికలు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు. ఇక ప్రధాని మోదీతో భేటీ అయితే వైసిపి నాయకులకు ఎమ్ అవసరం అని పవన్ అన్నారు. ఇక తాజాగా పవన్ వ్యాఖ్యలపై వైసిపి నాయకులు ఒక్కొక్కరు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలా ఒకరొకరు పవన్ కు కౌంటర్ ఇచ్చారు.
2019లోనే చూశాం..2024లో ఏం చూస్తాం..
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ ఏం చేశారో చూశాం. 2019 ఎన్నికల్లో కూడా పవన్ సత్తా చూశాం. ఇక కొత్తగా 2024లో చూసేదేమి లేదని, కొత్తగా చూసేది కూడా లేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
ప్రధానితో పవన్ఏం మాట్లాడితే మాకెందుకు?
జగన్ పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమి లేదు. సజ్జలకు నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా. వైసీపీకి 67 సీట్లు వచ్చినపుడు, 151 సీట్లు వచ్చినపుడు నోట్లో వేలు పెట్టుకొని చూశావా అని పవన్ ను పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ ను నమ్మితే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదడమే.పవన్ మోదీ ఏం మాట్లాడుకుంటే మాకేంటి. నువ్వు మోదీతో ఏం మాట్లాడావో అని చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు. వెళ్లి ఆయన చెవిలో చెప్పు అని మండిపడ్డారు. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే పవన్ ఇలా చేస్తున్నారు. పవన్ ఇప్పటం వస్తే ఏం ఆగింది. గతంలో చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో దౌర్జన్యం చేసినప్పుడు ఏమి గుచ్చుకోలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు.
జోగి రమేష్ ఫైర్..
పవన్ కళ్యాణ్ వీకెండ్ సైకో అని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ కు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేయాలనీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ చిల్లర వేషాలు మానుకోవాలని, వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టి ప్రజలు పవన్ కు బుద్ది చెప్పారన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Botsa satyanarayana, Janasena, Pawan kalyan, Ycp