హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: వైసీపీ వర్సెస్ అచ్చెన్న..టెక్కలిలో ఈసారి అంత ఈజీ కాదు..ఎందుకంటే?

Ap: వైసీపీ వర్సెస్ అచ్చెన్న..టెక్కలిలో ఈసారి అంత ఈజీ కాదు..ఎందుకంటే?

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

టెక్కలి టీడీపీకి గడ్డు రోజులు వచ్చేశాయి. ఇంటా బయటా కూడా కాస్త కష్టమైన  పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గం నేత..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి కష్టకాలం మరో పదేళ్లు ఉందంటోంది వైసీపీ. ఈ సారి ఆయన్ని ఎమ్మెల్యే అవ్వనివ్వం అంటోంది వైసీపి. కుప్పంలో చంద్రబాబు ఎంత ముఖ్యమో..ఇక్కడ టెక్కలిలో అచ్చెన్న కూడా అంతే ముఖ్యం అంటోంది టెక్కలి వైసీపి. ఇన్నిమాటలేల..? టెక్కలిలో అచ్చెన్న గెలవడం అసాధ్యం అంటూ వైసీపీ ఇప్పటికే భీష్మించుకు కూర్చుంటోంది. నిల్చుంటోంది. అసలు నిద్రపోవడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

టెక్కలి టీడీపీకి గడ్డు రోజులు వచ్చేశాయి. ఇంటా బయటా కూడా కాస్త కష్టమైన  పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గం నేత..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి కష్టకాలం మరో పదేళ్లు ఉందంటోంది వైసీపీ. ఈ సారి ఆయన్ని ఎమ్మెల్యే అవ్వనివ్వం అంటోంది వైసీపి. కుప్పంలో చంద్రబాబు ఎంత ముఖ్యమో..ఇక్కడ టెక్కలిలో అచ్చెన్న కూడా అంతే ముఖ్యం అంటోంది టెక్కలి వైసీపి. ఇన్నిమాటలేల..? టెక్కలిలో అచ్చెన్న గెలవడం అసాధ్యం అంటూ వైసీపీ ఇప్పటికే భీష్మించుకు కూర్చుంటోంది. నిల్చుంటోంది. అసలు నిద్రపోవడం లేదు.

TS CETs-2023: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. EAMCET, ICET, LAWCET, ECET తదితర అన్ని పరీక్షల తేదీలివే..

అచ్చెన్నాయుడు. కింజరాపు కుటుంబంలో ఎర్రన్న తర్వాత వినిపించే ప్రముఖ పేరు. రామ్మోహన్ నాయుడు (ముద్దుగా రాము)కి మించి పార్టీలో కీ రోల్ ఇస్తుంటారనేది నిర్వివాదాంశం. కారణాలు ఏవైనా..అచ్చెన్నాయుడుకి టీడీపీ మంచి విలువ ఇస్తోంది. కానీ.. అది ఒకప్పటి టీడీపీ. ఇప్పుడు లోకేష్ పాలిత టిడీపీలో అచ్చెన్నకు సుఖాలు సౌలభ్యాల కన్నా..కష్టాలే ఎక్కువ. అయితే ఆ విషయాలు అంతగా బయటకు పొక్కవు. తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పుట్టింది. కానీ..ఇప్పుడు రాజకీయాలు ప్రాంతాల వారీగా..కుమ్ములాటలు జిల్లాల వారీగా ఉన్న పార్టీగా టీడీపికి మంచి పేరు ఉంది. అందుకే.. ప్రాంతాల్లో ఒకలా..వ్యక్తుల్లో మరోలా ఉండే ఆ పార్టీలో ఇప్పటికీ ఏకాభిప్రాయం కష్టమే.

వైసీపీ ఎమ్మెల్యేకి ఇక కష్టమే..! ఆయన కూడా డిసైడ్ అయ్యారా..? అంతా ఐ ప్యాక్ పుణ్యమేనా..?

ఇక విషయానికి వస్తే..టీడీపీ యువనాయకత్వం ఇప్పుడు అచ్చెన్నాయుడ్ని అంతగా పట్టించుకోవడం లేదట. అచ్చెన్న వ్యవహార శైలి ఇందుకు పెద్ద కారణం. అయితే టీడీపీలోని ఈ విషయాన్ని పసిగట్టిందో ఏమో వైసీపీ మాత్రం అచ్చెన్న పై మరింత పటిష్టంగా స్కెచ్ లు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో గెలిచిన టీడీపీ నేతల్లో అచ్చెన్నని గట్టిగా టార్గెట్ చేసింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా చూసీ చూడనట్టు ఉండాలని భావిస్తోందని సమాచారం. అచ్చెన్న గెలుపు పార్టీకి అంత ప్లస్ కాదనేది టీడీపీలో టాక్. పార్టీ పై విషప్రచారం చేస్తున్న అచ్చెన్నకి కౌంటర్ ఇవ్వాలనేది టీడీపీ యువనాయకత్వం భావనట. అయితే అదేదీ పూర్తిగా బయటకు మాత్రం అనడం లేదు.

అటు వైసిపికి మాత్రం 2024 ఎన్నికలు  ఒక పెద్ద ప్లస్. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టెక్కలిలో అచ్చెన్న సీటు చింపేయాలని భావిస్తున్నారు. అందుకే ఎప్పుడూ కలవని కళింగ సామాజిక వర్గం ఇప్పుడు చేతులు కలుపుతోంది. చేతులతో పాటు..కాళ్లు కూడా కలిపేస్తోంది. నియోజకవర్గంలో తిరుగాడుతోంది. అలాగే బుర్ర పెట్టి పని చేయడానికి రెడీ అయ్యింది. ఉన్న నలుగురు కళింగ యోధాన యోధ నేతలందరూ  ఒక్కటిగా అవ్వాలని ఆశపడ్డారట. అలా కలిసి.. నియోకవర్గంలో అచ్చెన్నని పక్కన పెట్టి.. తమ సామాజికవర్గం వారే గెలవాలనేది యోచనగా తెలుస్తోంది. తర్వాత.. అధికార చలామణి సంగతి ఆలోచిద్దామనేది ఆలోచన. ఏదేమైనా.. టెక్కలిలో వైసీపీ నుంచీ అచ్చెన్నకి ఈసారి ఈజీ కాదు.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, TDP, Ycp

ఉత్తమ కథలు