AP POLITICS YCP TOTAL TARGET IN 2024 ELECTIONS THEY READY TO SEARCH MAILNLY TARGETED KUPPAM NGS
Target Kuppam: కుప్పం = 175.. ఇదే వైసీపీ లెక్క.. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఓడిస్తే 175 నెగ్గినట్టేనా..?
లోకేష్, చంద్రబాబు (ఫైల్)
Target Kuppam: టార్గెట్ 175 అంటోంది వైసీపీ.. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో నెగ్గిన ఫ్యాన్ ఫార్టీ.. ఈ సారి మరింత స్పీడ్ పెంచుతామంటోంది. అయితే 175 సీట్ల సంగతి ఎలా ఉన్నా.. కుప్పంలో విజయం సాధిస్తే 175 నెగ్గినట్టే అని.. మిగిలిన చోట్ల కూడా ఈజీ నెగ్గే అవకాశాలు ఉంటాయని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
Target Kuppam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)2024 టార్గెట్ గా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి నుంచి ప్రతీ అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు నెగ్గామని.. ఈ సారి 151 సీట్లు తగ్గకూడదని చెబుతూనే..175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలను, మంత్రులను ఆయన ప్రశ్నించారు. మొత్తం అన్ని సీట్లలో గెలుపు సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి లెక్కలు కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పాలనపై 65 శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఎమ్మెల్యేలపై 45 శాతమే సంతోషం ఉందన్నారు. తన పాలన పైన ప్రజలు పూర్తి పాజిటివ్ గా ఉన్నారని.. ఎమ్మెల్యేలు కూడా ఇప్పనుంచి కష్టపడితే.. గెలుపు నల్లేరుపై నడకే అన్నది ఆయన అభిప్రాయం. కేడర్ లోనూ అదే ధీమా కలిగించి..వారిలో మరింత జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన 175 సీట్లలో గెలవలేమా? అని ఆయన ప్రశ్న వెనుక లెక్క కుప్పం విజయంపైనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే సీఎం జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కుప్పం (Kuppam) గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనూ కుప్పం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కంచుకోట అయిన కుప్పంలోనే వైసీపీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిందని.. మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు గెలవలేమని సీఎం ప్రశ్నించారని టాక్. కుప్పంలో పంచాయితీ ఎన్నికల్లో... మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమా అంటూ ధీమా వ్యక్తం చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సొంత నియోజవర్గంలో పథకాలు.. ప్లస్ పోల్ మేనేజ్ మెంట్ కలిస్తే స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో విజయం దక్కిందనేది పార్టీ నేతల వాదన. దానికితోడు చంద్రబాబు సొంత నియోజవకర్గంలో అంత బలహీనపడ్డారా అనేది మరో చర్చ. మరీ ఈ అడ్డంకులను చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) తరువాత నుంచి అక్కడ ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తోంది వైసీపీ. గత ఎన్నికల్లో పోటీ చేసిన కుప్పం అభ్యర్ది చంద్రమౌళి కుమారుడు భరత్ కి ఎమ్మెల్సీ పదవి తో పార్టీ పదవి కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి (Minster Peddireddy)సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయనే అభ్యర్ధి అంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. కానీ, బీసీ వర్గానికే సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకు ఏడు సార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మరో పార్టీ అక్కడ గెలవలేదు. 2019 లో జగన్ ప్రభంజనం కొనసాగిన సమయంలోనూ కుప్పం ఫలితాల్లో రెండు రెండు రౌండ్లలో వైసీపీ ఆధిక్యత కనిపించింది. ఓవరాల్ గా చిత్తూరు విషయం చూసుకున్నా.. చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు.
అందుకే ఈ సారి చిత్తూరు జిల్లా నుంచి అనూహ్యంగా ముగ్గురికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. టార్గెట్ చంద్రబాబు గానే ఈ వ్యూహం అమలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా కుప్పం పైన కొత్త వ్యూహాలతో అక్కడ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే పెట్టారు అధినేత. ప్రస్తుతం పెద్దిరెడ్డి కుప్పంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కేవలం కుప్పంపైనే ఫోకస్ చేయడానికి కుదరదు. స్థానిక నేతల పైనే ఆయన కుప్పం బాధ్యతలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ మంత్రి..జిల్లా టీడీపీ నేతలకు కుప్పం లో మకాం వేసినా.. ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయాలి వైసీపీ భావిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.