ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెరిగిన విద్యుత్ ఛార్జీలు (Electricity Charges Hike), బస్సు ఛార్జీల (Bus Charges Hike) పై అధికార పార్టీని.. ప్రతిపక్షాలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. అన్నీ పార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చి సీఎం జగన్ (CM YS Jagan) పై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. సీఎంపై సెటైర్లు వేశారు. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కోతల రాయుడు.. బాదుడు వీరుడంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల ఇబ్బందులపై మాట్లాడుకోవాల్సిన అవసరముందన్న ఆయన.,. ఐటీ ఉద్యోగులు ఇబ్బందులో ఉన్నారని., వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్నారు కరెంట్ లేక తంటాలు పడుతున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమ నడవాలంటే విద్యుత్ అవసరం ఇప్పుడు కరెంట్ కోతలు పెడితే ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. చేతకాని తనంతో ఇసుక దొరకకుండా రెండేళ్లు నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని.., ఇప్పుడు కరెంట్ కష్టాలు తెచ్చారని విమర్శించారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ అద్దెకు ఇవ్వాలని చూశారన్నారు. విద్యుత్ ప్లాంట్స్ నడపకుండా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతారా అని ప్రశ్నించారు. ఏ పని చేయాలన్నా కరెంట్ కావాలి.., కానీ ఇలాంటి సందర్భంలో కరెంట్ లేకపోతే ఎలా..? అని ప్రశ్నించారు.
కేంద్రం పెట్రోల్ రేటు పెంచితే మన జీఎస్టీ పై,వచ్చే పన్నుల పై ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పవర్ రేటును 15 రెట్లు పెంచారని.., ఆర్టీసీ చార్జీలు పెంచకుండా డీజిల్ పై పన్ను వేస్తున్నట్లు చెబుతూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. డీజిల్ ,పెట్రోల్ రేటుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకోవాలని.., మీకు వచ్చే పన్నుల వాటా మాత్రం తగ్గించుకోరా? రఘురామ నిలదీశారు. రాష్ట్రంలో అమ్మ ఒడి తప్ప మిగతావి అన్ని కూడా బోగస్ పథకాలేనన్న రఘురామ.., అమ్మఒడి ఇచ్చి మన ఇళ్లను గుల్ల చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పథకాల పై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా రావొచ్చని ఛాలెంజ్ చేశారు.
సీఎం ఆఫీస్ కు వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుందని.., జగన్ రావడం లేదన్న సాకుతో ఇతర మంత్రులు, అధికారులు కూడా సెక్రటేరియట్ కు రావడం మానేశారన్నారు. ఏపీ చరిత్రలో ఆఫీస్ కి వెళ్లాని ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ఒక ఎస్సీకి సీఎం పదవి ఇస్తే జగన్ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారాయన. ఇక మాజీ మంత్రి మేకతోటి సుచరిత స్టేట్ మెంట్ అదిరిపోయిందంటూ రఘురామ సెటైర్లు వేసారు. మంత్రి పదవి రానందుకు మేకతోటి సూచరిత ఏ పార్టీ వారితో మాట్లాడిందో కూడా తెలుసని మరో బాంబు పేల్చారాయన. స్పీకర్ తమ్మినేని జగన్మోహన్ రెడ్డి రథచక్రం కింద నలిగిపోతున్నామని పరోక్షంగా అని ఉంటారని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju