హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్టులో ఏముంది..? ఆర్మీ వైద్యులు ఏం తేల్చారు

RRR: ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్టులో ఏముంది..? ఆర్మీ వైద్యులు ఏం తేల్చారు

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మెడికల్ రిపోర్టులు సిద్ధమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు చేసినట్టు ఆర్మీ వైద్య అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్టులో ఏం ఉంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...

  ఎన్నికల ఫలితాల కోసం ఎలా ఎదురు చూస్తారో.. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా అంతా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏం అవ్వలేదని స్పష్లం చేశారు. కానీ రఘురామ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ అవి తాజాగా తగిలిన దెబ్బలే అని తేలితే.. ఏపీలో సీఐడీ పోలీసుల వ్యవహారాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇటు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఊహించడం కష్టమే. అలా కాకుంబా అవి తాజాగా కొట్టిన దెబ్బలు కాదని తెలిస్తే.. అసత్యాలు చెప్పినందుకు ఎంపీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

  సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి రఘురామను సోమవారం రాత్రి  11  గంటలకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి  ఎంపీకి పరీక్షలు నిర్వహించారు.  వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు.  ముగ్గురు వైద్యుల మెడికల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉండనున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది.

  ఇదీచదవండి: డాక్టర్లకు సోనూ సూద్ సూటి ప్రశ్న? అలా ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం

  ఆస్పత్రికి వచ్చిన వెంటనే ఆర్మీ వైద్యులు ఆయన శరీర ఉష్ణోగ్రత, బీపీ, పల్స్‌ ఇతర ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు, చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్‌ రూమ్‌లో ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామరాజు ఫిర్యాదుచేయడంతో ఈ పరీక్షలు చేశారు. కుడి కాలికి తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి, అంతర్గత గాయాల నొప్పి తగ్గించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సేకరించిన రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం తెలంగాణ హైకోర్టు తమ రిజిస్ట్రార్‌ నాగార్జునను జ్యుడీషియల్‌ అధికారిగా నియమించింది. ఆయన సమక్షంలోనే ఆర్మీ వైద్యులు రఘురామరాజుకు అవసరమైన చికిత్స అందించారు.

  ఇదీచదవండి: యాంకర్ అనసూయ ఏంటి అలా చూపించేసింది..? నిజమేనా అని షాక్ లో ఫ్యాన్స్

  మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు, వైద్య చికిత్స కొనసాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ మొత్తాన్నీ అధికారులు వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. చికిత్స సందర్భంగా ఆయన మాటలను కూడా రికార్డు చేశారు. పరీక్షలు ముగిశాక ఈ వివరాలను ఆర్మీ ఆస్పత్రి అధికారులు హైకోర్టు రిజిస్ర్టార్‌ ద్వారా ఈ నెల 21న సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందజేయనున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP Politics, MP raghurama krishnam raju, Supreme Court

  ఉత్తమ కథలు