హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: నేడు సీఎం జగన్ ఎన్నికల సమర శంఖం.. జయహో బీసీకి భారీ ఏర్పాట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM Jagan: నేడు సీఎం జగన్ ఎన్నికల సమర శంఖం.. జయహో బీసీకి భారీ ఏర్పాట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

నేడే జయహో బీసీ

నేడే జయహో బీసీ

CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా జయహో బీజేపీ పేరుతో భారీ స్కెచ్ వేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఇతర పార్టీలతో పోలిస్తే.. అధికార వైసీపీ (YCP) మరింత దూకుడుగా ఉంది. గెలుపు కావాల్సిన అన్ని వ్యూహాలను పర్యవేక్షిస్తున్న సీఎం జగన్ (Jagan).. కొత్త కొత్త అస్త్రాలను సంధిస్తున్నారు. ఇప్పుడు మరో భారీ స్కెచ్ తో సిద్ధమయ్యారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలి అంటే.. బీసీ ఓట్లు చాలా కీలకం.. అందుకే బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు భారీ ఎత్తున జయహో బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. ఐతే అధికార వైసీపీ.. మాత్రం బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటోంది. ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’కార కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ (YSRCP) అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు తదితరలు పరిశీలించారు.

తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు.. ‘జయహో బీసీ’ నినాదం చంద్రబాబుకు సొంతం కాదన్న విజయసాయిరెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందనన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న ఆ వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లలో 50 శాతం నామినేటెడ్‌ పదవులు ఇచ్చి రాజకీయంగా, సంక్షేమం కింద 1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ ఆవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకు తిరిగేలా చేసిందన్నారు. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్‌ జగన్‌ ఘనత అన్నారు విజయసాయిరెడ్డి..

ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నేడు జరగనున్న జయహో బీసీ మహాసభను జయప్రదం చేయాలని ఆయన బీసీలను కోరారు. ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సభ తరువాత జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి : మీడియాలో యాంకర్ గా కూడా పనికిరావ్.. వైసీపీ ఎంపీవైతే చంద్రబాబుతో పనేంటి..?

రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా, డీసీపీలు విశాల్‌ గున్ని, శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌కు ఎంపీ సూచించారు. ఈ సమావేశానికి సంబంధించి ఇక వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్‌ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధంచేయిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి : ప్రపంచం చూపు మనవైపు ఉందన్న ప్రధాని.. సమావేశంలో జగన్, చంద్రబాబు ఏం చెప్పారంటే..?

షెడ్యూల్‌ ఇదీ..

ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభను ప్రారంభిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగిస్తారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayasai reddy, Ycp

ఉత్తమ కథలు