Target 2024: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసేది సామాజిక సమీకరణాలే.. అది కాదనలేని సత్యం.. వచ్చే ఎన్నికల్లోనూ ఈ సామాజిక సమీకరణాలే గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఎక్కువ శాతం వైసీ వైపే మొగ్గుచూపుతారని రాజకీయ విశ్లేషకుల అంచనా..? ఇక కమ్మ, క్షత్రియ, ఇతర ఓసీ కులాలు పొత్తు ఉంటే జనసేన (Janasena), టీడీపీ (TDP) వైపు మొగ్గుచూసే అవకాశం ఉంది. దీంతో బీసీ ఓట్లు (BC Voters) ఈ ఎన్నికల్లో చాలా కీలకం కానున్నాయి. ఒకప్పుడు బీసీలు టీడీపీ వెంటే ఉండేవారు.. కానీ గత ఎన్నికల్లో బీసీల్లో ఎక్కుమంది జగన్ ను జై కొట్టారు. దీంతో ఆ ఓట్లను మళ్లీ తమవైపుకు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు వైసీపీ సైతం బీసీ ఓట్లు మళ్లీ తమకే పడేలా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా బీసీ ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా పార్టీ పెద్దలు సమావేశం నిర్వహించారు. బీసీలను సంతృప్తి పరిచేలా మా ప్రభుత్వ పనిచేస్తుందని.. బీసీ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించే దిశలో వైయస్సార్ సీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా చేస్తున్న కృషి చేస్తోంది అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).
రాష్ట్రంలో ఉన్న 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, బీసీ సామజిక వర్గాలను సంతృప్తి పరిచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. ఇందులో భాగంగానే 225 మంది బీసీ ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని.. దీన్ని ఒక కోర్ కమిటీ సమావేశంగా పరగణిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలోని బీసీ నాయకులందరిని కలుపుకుని, రాబోయే రోజుల్లో 26 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించదలచుకున్నామన్నారు.
వైయస్సార్ సీపీ బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, ఇతర సామాజిక వర్గాలకు సమానంగా బీసీల అభివృద్ధి చెందేలా మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో బీసీల కోసం ఖర్చు పెట్టిన మొత్తం కేవలం 19,369 కోట్లు మాత్రమే అని.. కానీ వైయస్సార్ సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏ వర్గానికి ఎంతెంత ఖర్చు పెట్టిందనేది ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్ళల్లో డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు 2 లక్షల కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి : ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం.. శోభన్ బాబు ఇంట్లో భారీగా అక్రమాస్తులు గుర్తింపు
కేబినెట్ నుంచి.. నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. మొత్తం 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే, అందులో 243 బీసీలకు ఇచ్చామన్నారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని. శాశ్వత ప్రాతిపదిక పైన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే.. అందులో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చామన్నారు. ఇక సచివాలయాల్లో 2.7లక్షల వాలంటీర్ ఉద్యోగాలతో పాటు మిగతావాటిని కలుపుకుని 6లక్షల 3వేల ఉద్యోగాలును కల్పిస్తే.. అందులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayasai reddy, Ycp