Home /News /andhra-pradesh /

AP POLITICS YCP NAGARI MLA RK ROJA CHALLAGE TO CHANDRABABU NAIDU AND NARA LOKESH IF CONTEST SINGLE ONLY NGS

MLA Roja: పొత్తులతో కాదు.. దమ్ముంటే సింగిల్ గా రండి అంటూ చంద్రబాబు, లోకేష్ కు రోజా సవాల్..?

ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే రోజా

MLA Roja:ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అప్పడే అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు పై ఫోకస్ చేస్తూ.. వ్యూహాలు రచిరిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు దేశం పార్టీ పొత్తులవైపు మొగ్గు చూపుతోంది. అయితే ఎమ్మెల్యే రోజా టీడీపీకి సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...
    MLA Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార-విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఇప్పటి నుంచే అదే పరిస్థితి నెలకొని ఉంది. ఇటు అధికార వైసీపీ (YCP), అటు ప్రతిపక్ష తెలుగు దేశం  (Telugu Desam) సైతం అప్పుడు వచ్చే ఎన్నికలపై ఫోకస్ చేశాయి. ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ పొత్తులపై ఫోకస్ చేస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమైంది. అయితే ప్రస్తుతం జనసేన (Janasean)-బీజేపీ (BJP) మధ్య పొత్తు ఉంది. మరి టీడీపీతో పొత్తు అంటే బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పొత్తులు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా.. టీడీపీ మాత్రం పొత్తులతోనే వెళ్లే యోచనలోనే ఉంది. తాజాగా ఈ పొత్తులపై వైసీపీ నగరి ఎమ్మెల్యే  రోజా (MLA Roja) స్పందించారు. పొత్తులు లేకుండా సింగిల్ గా పోటీ చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ఆమె సవాల్ విసిరారు.

    అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో అమ్మ ఒడి ఒక అబద్ధం అని చేసిన కామెంట్ కు కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ను  పప్పు నాయుడు  అని సంభోదిస్తూ.. అమ్మ ఒడి వస్తుందా.. రావడం లేదా అని పిల్లల తల్లులని అడిగితే తెలుస్తుందన్నారు. పక్క రాష్ట్రాల్లో అమలు చేసేంత ఆదర్శప్రాయంగా అమలవుతుందని గుర్తు చేశారు.

    ఇదీ చదవండి: పేద ప్రజలకు వెల్ ఫేర్.. చంద్రాబుకు ఫేర్ వెల్.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం

    గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన పథకాలను పక్క రాష్ట్రాల్లో ఎవరైనా అనుసరించారా అని రోజా ప్రశ్నించారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు ఆమె. అసలు టీడీపీ నేతలు ఎవరికీ.. మహిళల గురించి మాడ్లాడే అర్హత లేదన్నారు. ప్రతిపక్ష నేత  సీఎంగా ఉన్నప్పుడు తొలి సంతకం బెల్టు షాపులు తొలగించడంపైనే అని అన్నారని.. కానీ ఆయన పదవి కాలం పూర్తి అయ్యేటప్పటికి 43 వేల బెల్టు షాపులున్నాయని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది అన్నారు.

    ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ తీరు ఉందని ఆమె మండిపడ్డారు. మందు బాబుల కోసం ఉద్యమాలు చేసే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అంటూ విమర్శించారు. సీఎం జగన్ హయాంలో మద్యం షాపులు తగ్గుతుంటే చంద్రబాబు మాత్రం మద్యం తాగమంటూ రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చీప్‌లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు మారారని విమర్శించారు. కానీ సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు అన్నారు. 26 జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిజంగా చంద్రబాబు, లోకేష్ లకు అంత ధైర్యం, దమ్ము ఉంటే ఏ పార్టీ అయినా పొత్తులతో కాకుండా సింగిల్‌గా పోటీ చేయాలి అంటూ రోజా సవాల్ విసిరారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, MLA Roja, Nara Lokesh, TDP

    తదుపరి వార్తలు