Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MP VIJAYASAI REDDY WILL TAKE KEY ROLE IN NEXT 2024 ELECTIONS JAGAN ALSO GAVE FREE HAND NGS VSP

YCP Target 2024: మరోసారి ఆయన్నే నమ్ముకున్న అధినేత.. 2024లో విజయం కోసం కీలక బాధ్యతలు

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

YCP Target 2024: అధినేతకు అయనకు మధ్య చాలా గ్యాప్ పెరిగింది అన్నారు. కావాలనే ఆయన్ను పక్కన పెట్టారని ప్రచారం జరిగింది.. కానీ ఇంతలోనే సీన్ మారింది. ఇప్పుడు 2024 ఎన్నికల బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు జగన్. ఆయనపై అంత నమ్మకమా..? వేరే వ్యూహం ఉందా..?

ఇంకా చదవండి ...
  P Anand Mohan, Visakhapatnam, News18.                      YCP Target 2024:  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఏపీ రాష్ట్ర  రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) దూరం పెడుతున్నారనే స్థాయి నుంచీ.. అధినేతే పిలిచి మరీ..  అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా.. సీఎంకు అత్యంత ఆప్తుడిగా.. ప్రభుత్వంలో ఆయన ఏం చెబితే అదే జరిగే అంత గుర్తింపు ఉన్న...  సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి వారు స్కెచ్ లు వేసినా.. ఇంకొందరు డబుల్ స్కెచ్ లు వేసినా.. విజయసాయికి అధిష్టానం దగ్గర ఉన్న గుర్తింపు పెరిగిందే తప్ప తగ్గలేదు.  అందుకే ఆయనకు ఇప్పటికే పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్.. పార్టీ గెలుపు బాధ్యతను ఆయన భుజాలపై వేశారు.. అక్కడితోనే ఆగలేదు.. ప్రభుత్వంలోనూ భాగస్వామిగా చేస్తున్నారనే ప్రచారం ఉంది.

  మొన్నటివరకూ విజయసాయిరెడ్డిపై పార్టీలో వ్యతిరేక వాదనే వినిపించేది. ఆయనను సీఎం జగన్ దూరం పెడుతున్నారని.. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం అవుతున్నారని.. ప్రచారం జరిగిదే..  అప్పటి పరిణామాలు కూడా అలాగే కనిపించాయి. అందుకే  కార్యకర్తల నుంచీ నాయకుల వరకూ ఆయన చుట్టూ తిరగడం కూడా మానేశారు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంపీ స్థాయిలో తాను సిఫార్సు లెటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆయన అనుచరులే పెదవి విరిచేవారు.  ఆయన ఇచ్చిన  సిఫార్సు లేఖలను  ఇతర కారణాలు చూపించి..  టీటీడీ అధికారులు తిరస్కరించేవారని ప్రచారం ఉండేది.

  ఇదీ చదవండి : ఆ ఎమ్మెల్యే రూటెటు? వైసీపీలోకి ట్రయల్స్.. జనసేన వైపు చూపు 

  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లెటర్లు కూడా వర్కవుట్ అయ్యేవి. కానీ.. విజయసాయిరెడ్డి లెటర్ మాత్రం వద్దని.. ఏకంగా ఈవో స్థాయిలో తిరస్కరించేవారని విపరీతంగా సోషల్ మీడియాలో టాక్ వినిపించేది.  ఈ విషయాన్ని చాలాసార్లు విజయసాయి రెడ్డి అనుచరులే చెప్పుకునే వారు.  అంతేకాదు.  పార్టీ కార్యక్రమాలకు వెళ్లండి.. కానీ.. కార్యకర్తల్ని, నాయకుల్ని మేనేజ్ చేయొద్దని  అధినేత ఆఫీస్ నుంచీ మెసేజ్ లు వచ్చాయంటూ టాక్ కూడా నడిచింది.  దాదాపు ఏడాదిన్నర పాటు ఇదే పరిస్థితి కొనసాగింది.

  ఇదీ చదవండి : ఇలా అయితే కష్టమే.. ఇంటింటికీ వెళ్లండి.. ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్..? జగన్ లెక్క ఇదే.. కేబినెట్ విస్తరణ ఎప్పుడంటే?

   ఏడాది క్రితం జీవింఎసీ ఎన్నికల విషయంలోనూ పార్టీ అంతగా ఆయన్ని పట్టించుకోలేదన్న టాక్ ఉంది.  అయితే విజయసాయి మాత్రం పార్టీ గెలుపుకోసమే పనిచేశారని..  టీడీపికి దక్కాల్సిన చాలా వార్డుల్ని వైసీపీ పరం చేశారని.. తన రాజకీయ చతురతను ప్రదర్శించారని అధినేతకు రిపోర్టులు అందాయనే ప్రచారం కూడా ఉంది.   

  ఇదీ చదవండి : జూనియర్ ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..?

  నిజానికి వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.. అధినేత జగన్ కూడా ఆ విషయం తెలుసు. అందుకే విజయసాయికి పార్టీలో అంత వెయిట్ ఉంటుంది.  కానీ స్థానిక నేతల నుంచి.. కీలక నేతల వరకు చాలా మంది విజయాసాయి పై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం.. విశాఖను అంతా తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. అధినేతకు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ప్రచారం ఉండేది. అందుకే ఆయన్ను పక్కన పెట్టారంటూ వైసీపీ వర్గాల్లోనే టాక్ నడిచింది.

  ఇదీ చదవండి : మంత్రులుగా కొనసాగేది వీరే.. ఆయనకు కీలక పదవి.. కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్.. జగన్ ఫార్ములా ఇదే

  అయితే వైసీపీ రాజకీయ వ్యూహకర్త పీకే నివేదిక ఇచ్చిన తరువాత పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. ఆయన సూచన మేరకే  ఇప్పుడు  అదే విజయసాయిరెడ్డికి పిలిచి మరి అధినేత కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికు వైసీపీ అనుబంధాల సంఘాల బాధ్యత అంతా విజయసాయికి అప్ప చెప్పారు జగన్. మరోవైపు పార్టీ కార్యాలయ బాధ్యతలు కూడా ఆయనకే అప్పచెబుతారనే ప్రచారం ఉంది. వీటన్నిటికంటే.. ఏపీ ప్రభుత్వంలోనూ ఆయన్ను భాగం చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

  ఇదీ చదవండి : రెండో రోజూ సేమ్ సీన్.. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. ఎవరెవరు ఉన్నారంటే..?

  విజయసాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని..  ఆర్ధిక శాఖను అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది.  అయితే ఈ ప్రచారం నిజమో కాదన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.. 
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Vijayasai reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు