Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MP VIJAYASAI REDDY TWEET ON RAHUL GANDHI ON ED CASES NGS GNT

MP Vijayasai Reddy: కర్మఫలం అనుభవించక తప్పదు.. రాహుల్‌పై విజయ సాయిరెడ్డి సెటైర్లు

ఎంపీ విజయసాయి రెడ్డి

ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: మనం ఏదైతే చేస్తామో.. అదే మనికి తిరిగి వస్తుంది అంటూ వేదాంత ధోరణిలో సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. రాహుల్ గాంధీపై కేసులు విషయంలో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.. ఆయన ఏమన్నారంటే..?

  Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రత్యర్తులపై మాటల దాడి చేయడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకుంటున్నారు. అయితే మొన్నటి వరకే కేవలం టీడీపీ, జనసేన నేతలను మాత్రమే విమర్శిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాను కర్మ సిద్ధాంతాన్నినమ్ముతానని, పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యమే.. అంటే మనం ఏది చేస్తే అది తిరిగి మనకు వస్తుంది అనే వేదాంత ధోరణిలో ట్వీట్ చేశారు. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలకు ఫలితం రాహుల్ గాంధీ అనుభవించక తప్పదన్నారు.

  ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ కేసు తెర మీదికి తెచ్చిందని గుర్తు చేశారు. దీన్నికేంద్ర ప్రభుత్వానికి ఆపాదించి కక్ష సాధింపుగా ఆరోపించడం ఏమాత్ర సరైన పద్ధతి కాదన్నారు. మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో వరుసగా మూడో రోజు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీని ఈడీ విచారిస్తోంది.

  మంగళవారం రాహుల్‌ను 12 గంటల పాటు విచారించింది ఈడీ. అయితే మంగళవారమే విచారణ ముగించాలని ఈడీ అధికారులను రాహుల్‌గాంధీ కోరినట్టు సమాచారం. కానీ బుధవారం మళ్లీ రావాలని కోరడంతో ఇవాళ హాజరయ్యారు. మరోవైపు రాహుల్‌ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

  కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అటు ఏఐసీసీ కార్యాలయం దగ్గర , ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

  ఇదీ చదవండి : హోరుమని సముద్ర కెరటాల హోరు.. మనసును ఆహ్లాదపరిచే ఉద్యానవనం మరోవైపు.. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది

  గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఇళ్లపై సిబిఐ అధికారులు సోదాలు చేసిన సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇదే స్థాయిలో సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలుచేశారు. అప్పుడైతే చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్రవాదిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలంటూ విజయసాయి రెడ్డి డిమాండ్ కూడా చేశారు. అంతేకాదు చిదంబరాన్ని తక్షణమే అరెస్టు చేసి, 2004-14 మధ్య కాలంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై న్యాయ విచారణ జరపాలన్నారు. చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థులపై కనికరం లేకుండా కేసులు బనాయించాడని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని.. కర్మ తిరిగి రివర్స్ కొడుతోందంటూ విజయసాయి రెడ్డి అప్పుడు విమర్శించారు.

  ఇదీ చదవండి : ముగ్గురు మంత్రులున్నా అయోమయ పరిస్థితి.. ద్వితీయ శ్రేణి నాయకులకు ఏమైంది?

  వైట్ కాలర్ నేరాలు, మోసం, పట్టపగలు దోపిడీలు చేసి, ఆపై ఆర్థిక మరియు రాజకీయ సమస్యల గురించి మాట్లాడే ధైర్యాన్ని అతను ఎలా పొందాడో అర్థం చేసుకోలేకపోయాను అని పేర్కొన్న విజయసాయిరెడ్డి, చిదంబరం రాష్ట్రానికి శత్రువు. అతని చట్టవిరుద్ధమైన , నేరపూరిత చర్యలు ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించాయి అని వ్యాఖ్యానించారు. తాజాగా రాహుల్ గాంధీని ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Rahul Gandhi, Vijayasai reddy, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు