Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు.. ఇప్పుబు బీజేపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన రెండు పరిణామాలు.. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతయా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏపీలో రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి.. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించినట్టు.. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి వెళ్లే అవకాశం ఉందని ఓ చర్చ జరుగుతుంటే.. మరో వర్గం మాత్రం.. వైసీపీకి బీజేపీ స్నేహమే కోరుకుంటుందని.. కేవలం జనసేనతో కలిసి వెళ్తుందని.. టీడీపీ ఒంటరిగానే పోటీ చేయక తప్పదని మరో వర్గం ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ.. టీడీపీ అధినేత చంద్రబాబు తో వ్యవహరించిన తీరు చూసిన తరువాత పొత్తు ఖాయమనే ప్రచారం మొదలైంది. కానీ అంతలోనే షాకిస్తూ.. ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి భుజం తట్టడం.. ఆయన కూర్చున్న నెంబర్ లంచ్ టేబుల్ దగ్గరే జగన్ మోహన్ రెడ్డి కూర్చోవడంతో.. కన్ఫ్యూజన్ మొదలైంది. అసలు బీజేపీ మైండ్ గేమ్ ఏంటి అన్నది అంతు చిక్కడం లేదంటున్నారు. అయితే తాజాగా ఆ సామవేశాలపై ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన స్టైల్లో కొత్త అర్థాలు చెప్పారు.
వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, ఎంపీ వి. విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. బాబు పరాన్న జీవి అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ.. రెండు నిమిషాలు మాట్లాడితేనే చంద్రబాబు ఎంతో ప్రచారం చేసుకున్నారని.. అదే ప్రధానితో సీఎం జగన్ లంచ్ చేశారంటూ పేర్కొన్నారు. ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు అంటూ విమర్శించారు.
అక్కడితోనే ఆగని విజయసాయి రెడ్డి.. నీతీ ఆయోగ్ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్ నెంబర్:1 అని.. అక్కడకు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకరు. అని గుర్తు చేశారు. కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు స్థాయి ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.
నీతీ ఆయోగ్ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్ నెంబర్:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఒకరు.
1/4
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 9, 2022
ప్రజల్లో స్వయం ప్రకాశం లేని చంద్రబాబు.. 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్ యద్ధం కారణంగా..? 2019లో మోదీ గాలిలో అధికారంలోకి రావటం తప్పితే.. సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి వారిని ఇంగ్లీష్‌లో పేరసైట్స్ అంటారని.. అంటే పరాన్న జీవులు అని అర్థమంటూ వివరించారు.
ఇలాంటి వారిని ఇంగ్లీష్‌లో పేరసైట్స్ అంటారు. అంటే... పరాన్న జీవులు! ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్ళలోనూ తిని... అందరి ఇళ్ళ వాసాలూ లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు?
4/4
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 9, 2022
ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్ళలోనూ తిని… అందరి ఇళ్ళ వాసాలూ లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు అంటూ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్ల వర్షం కురిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Vijayasai reddy