Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉన్నా.. ముందస్తు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ (TDP) పై నిత్యం విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) తాజాగా మరోసారి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును.. తనను భావి తరాలకు ఆదర్శంగా చెప్పుకునే ఒక్క పథకం కూడా ఏపీలో లేకపోవడం శోచనీయమన్నారు.
పొలిటికల్ మిర్చి, నాకౌట్ అంటూ వరుస పోస్టులు పెట్టిన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పవర్ ఫుల్ పంచ్ లు వేశారు. ఎలన్ మస్క్ (Elon Musk) కు ఐడియా ఇచ్చి స్పేస్ X రాకెట్ల (Space X Rockets) కంపెనీ పెట్టించింది బాబేనంట ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు వల్లేనంటూ ఆయన చెప్పుకోవడం వింటూ ఉంటామన్నారు. దావోస్ లో ఈయనను కలిసేందుకు బిల్ గేట్స్ రోజంతా వెయిట్ చేశాడని మీడియాలో రాయించుకున్న సంగతి చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది అంటూ ఎద్దేవ చేశారు.
ఇదీ చదవండి : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు? ఎక్కడంటే?
పాపం చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలి వేస్తోంది అన్నారు. ఎందుకంటే ఆయన్ను ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారట అంటూ ఇలా నాకౌట్ పేరుతో చేసిన పోస్టులు చేశారు. అలాగే చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను జనం నమ్మడం లేదంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాలికి చెట్ల కొమ్మలు విరిగినా అది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే అంటారు అంటూ విరుచుకు పడుతున్నా ఆయన తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం.. ప్రత్యేకత ఏంటి.. ఎక్కడుందో తెలుసా?
పార్టీ నేతలు లోకేష్ మాటలు విని చెడిపోయారని పొలిటికల్ మిర్చిలో పేర్కొన్న విజయసాయిరెడ్డి లోకేష్ మాటలు విని టిడిపి నేతలు నేరాలకు తెగబడ్డారు అంటూ పోస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో టిడిపి మహిళా నేత అరెస్ట్ అయ్యారని, బాలికపై లైంగిక వేధింపులు, ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ జైన్ అరెస్ట్ అయ్యారని, టీడీపీ ఎమ్మెల్సీ కారులో అక్రమ మద్యం పట్టివేతకు గురైందని పోస్ట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు పార్టీ ప్రచారంలో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ పేరును కుప్పం ప్రజాదర్బార్ లో ఒక అభిమాని ప్రస్తావించడంతో చంద్రబాబు ఎందుకు చిర్రెత్తిపోయారని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Vijayasai reddy