AP POLITICS YCP MP VIJAYASAI REDDY COMPLAINT AGAINST 20 TDP LEADERS ON SOCIAL MEDIA POSTINGS NGS
Social Media: సీఎం జగన్, ఎంపీ విజయసాయి పై సోషల్ మీడియాలో దుమారం.. సీఐడీ, సీఎంవోకు ఫిర్యాదు.. ఆ 20 మందిపై నిఘా
విజయసాయి రెడ్డి (ఫైల్)
Social Media: ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం మధ్య యుద్ధం పీక్ కు చేరింది. ఇఫ్పటికే రెండు పార్టీల మధ్య విమర్శలు హద్దులు దాటాయి. తాజాగా తెలుగు దేశానికి చెందిన కార్యకర్తలకు నేతలు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ.. సీఐడీ, సీఎంఓకు ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.. దీంతో 20 మందికిపై నిఘా పెట్టారు.
Social Media: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.. ఇప్పటికే విమర్శలు హద్దులు దాటుతున్నాయి. కొందరు నేతలు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. మరికొందరు బూతులు కూడా వెనుకాడడం లేదు. ఈ మాటల యుద్ధంతో ఏపీలో ప్రతస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ తీరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP)తో పాటు ఇతర పక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా వైసీపీ పాలనను ప్రశ్నిస్తే.. వారిని బెధిరించడంతో పాటు.. అక్రమ కేసులు పెడుతున్నారని ఇటీవలే చంద్రబాబు (Chandrababu) డీజీపీకి లేఖ కూడా రాశారు. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy).. మరోసారి టీడీపీ సోషల్ వింగ్ పై ఫిర్యాదు చేశారు. తనను, సీఎం జగన్ లపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు..
ప్రస్తుతం ఏపీలో బహిరంగంగా చేసుకునే విమర్శల కంటే మరింత పదునుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టుకోవడం, అందులోనూ బూతులతో రెచ్చిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇదే క్రమంలో తనపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులు చేశారు.
టీడీపీ సోషల్ మీడియాపై సీఐడీ, సీఎంఓ, అధికారులకు విజయ సాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.ఇందులో టీడీపీ సోషల్ మీడియా వింగ్ కుచెందిన 20 మంది పేర్లను ప్రస్తావించారు. వీరు నిరంతరం తనతో పాటు సీఎం జగన్ పై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో ఇప్పుడు సీఎంవో, సీఐడీ ఎలాంటి చర్యలకు దిగబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ విపక్షాలు గోల పెడుతున్నాయి. న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నాయి. మరోవైపు సీఐడీ మాత్రం ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ పై మరింత దూకుడుగా ముందుకు వళ్లేలానే కనిపిస్తోంది. అదికూడా అధికార వైసీపీలో నెంబర్ త్రిలో ఒకరుగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేయడంతో.. చర్యలు తప్పపకపోవచ్చు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.