AP POLITICS YCP MLC ANANTA BABU WILL SUSPENDED BY PARTY MINSTERS BOTSA AND AMBATI GAVE CLARITY NGS
YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు..! క్లారిటీ ఇచ్చిన మంత్రులు
ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)
YCP MLC: డ్రైవర్ సుబ్రమణ్యం మర్డర్ కేసు మిస్టరీ వీడింది.. స్వయంగా ఎమ్మెల్సీనే తాను హత్య చేశానని ఒప్పుకోవడంతో ఇప్పుడు అధికార పార్టీపై ఒత్తిడి పెరిగింది. దీనిపై మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు.. తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీనైనా క్షమించం అంటున్నారు. అంటే ఎమ్మెల్సీపై అధిష్టానం వేటుకు రంగం సిద్ధం చేసిందా..?
YCP MLC: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ని అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu) డ్రైవర్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్సీ అయ్యి ఉండి.. స్వయంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. గౌరవప్రథమైన పదవిలో ఉండి ఇలాంటి హత్యలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇవేవో కేవలం ఆరోపణలు మాత్రం కాదు.. స్వయంగా ఎమ్మెల్సీనే పోలీసుల ముందు ఆ విషయాన్ని ఒప్సుకున్నట్టు సమాచారం.. రాజకీయంగా వేడి పుట్టించిన ఈ హత్యకేసు (Murder Case) విషయంలో పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అటు హత్య చేసింది అధికార పార్టీ నేత కావడంతో.. ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు. అరెస్ట్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తీవ్ర ఒత్తిళ్లతో ఆయను అరెస్ట్ కాక తప్పలేదు. అంతేకాదు హత్య చేసింది తానేని ఒప్పుకున్నారు కూడా అని ప్రచారం జరుగుతోంది. హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది.. వివాదం ఎక్కడ మొదలైంది.. ఎలా హత్య చేసింది అన్ని వివరాలను పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం. ఈ హత్య కేసులో తప్పించుకునే వకాశం లేకపోవడంతోనే.. పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై అధికార వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి.. ఇలాంటి నేరాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి నేరాలు చేయడం అతడికి కొత్తకాదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అతడి నేరాలు అన్నీ పార్టీ అధిష్టానానికి తెలిసే జరుగుతున్నాయి అన్నది విపక్షాల వాదన.. అంతెందుకు హత్య చేసిన తరువాత కూడా ఆయన సజ్జల ను కలిశాడు అంటు నారా లోకేష్ (Nara Lokesh) విమర్శించారు. గతంలో కూడా అతడి నేర చరిత్రను అంతా తవ్వి తీస్తున్నారు విపక్ష నేతలు.. గతంలో ప్రజా ప్రతినిధులను బెదిరించింది. గంజాయి కేసులో హస్తం ఉండండం లాంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో అధికార పార్టీపై ఒత్తిడి పడింది. అయితే ఆ డ్యామేజ్ నుంచి తప్పించుకోవాలి అంటే.. అతడ్ని సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ క్షణమైనా అనంతబాబు ను సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కారు డ్రైవర్ హత్య కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన అనంతబాబు ఇప్పటికే పోలీసుల ముందు కూడా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఆయనపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయనున్నారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. సంకేతాలు ఇఛ్చేశారు. అరెస్టు తర్వాతే సస్పెన్షన్ ఉంటుందన్నారు.
ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.