Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MLC ANANTA BABU ATTACKED ON ONE PRISONER IN SAME JAIL ROOM IN RAJUMANDRY NGS

YCP MLC: జైలుకెళ్లినా మారని ఎమ్మెల్సీ తీరు.. తోటి ఖైదీపై అనంతబాబు దాడి.. సకల మర్యాదలు.. ములాఖత్ లు

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

ఎమ్మెల్సీ అనంతబాబు, మృతుడు సుబ్రహ్మణ్యం (ఫైల్)

YCP MLC: జైల్లో ఉన్నా.. ఇంటి దగ్గర ఉన్నా తన స్టైల్ అంతే అంటున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు.. సొంత డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన ఆయనలో కాస్తైనా పశ్చాత్తాపం లేదంటున్నారు. తాజాగా తోటి ఖైదీపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ రాజమర్యాధలు అనుభవిస్తున్నట్టు టాక్.

ఇంకా చదవండి ...
    YCP MLC: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్య కేసు (Car Driver Murder Case).. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ (YCP Mlc) స్వయంగా తానే హత్య చేయడంతో రాజకీయంగా ప్రకంపణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో నేరాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantababu) అంగీకరించినట్టు సమాచారం. అందుకే అతడిని అదుపులోకి తీసుకొని.. జైలుకు పంపారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైల్లో (Rajhumundray Jail)నూ హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. ఓ హత్య కేసులో జైల్లో ఉన్న ఆయనకు ప్రభుత్వం ఇప్పటికే అతిధి మర్యాదలు చేస్తున్నట్టు జైలు వర్గాల ద్వారా తెలుస్తోంది.  వివిధ పేర్లతో అపరిమితంగా ములాఖత్ లు కూడా కల్పిస్తున్నట్లు సమాచారం. జైలు నుండే అనంతబాబు సెటిల్ మెంట్లు చేస్తున్నారని ప్రచారం ఉంది. అదే సమయంలో ఆయన తన తోటి ఖైదీపై  కూడా చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. కారు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని దారుణంగా హతమార్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎందుకంటే ఈ హత్య కేసులో మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉంటున్నారు.

    జైలుకు వెళ్లిన తరువాత కూడా అనంతబాబులో మార్పు లేనట్టు తెలుస్తోంది. తాజాగా తన తోటి ఖైదీపై దాడి చేసినట్లు సమాచారం. గుర్తు తెలియని కారణంతో ఆయన తన తోటి ఖైదీపై చేయి చేసుకున్నట్లు సమాచారం. దీనిపై జైలు అధికారులు బయటికి వివరాలు చెప్పకపోయినా దాడి జరిగినట్లు మాత్రం గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఏదో విషయంలో తోటి ఖైదీతో మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జైల్లో ఉన్న ఖైదీలకు చికిత్స చేయాలంటే ఆస్పత్రిలో వారిపై చిన్న గీత కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ ఆయన తోటి ఖైదీకి ఈ దాడిలో చికిత్స చేయించుకునేంత దెబ్బలు తగల్లేదనే ప్రచారం జరుగుతోంది.

    ఇదీ చదవండి : పేదల పాలిట బంగారు తలంబ్రాలుగా మారుతున్న కల్యాణ మస్తు..! ఎప్పుడంటే..?

    జైల్లో ఉన్నా అనంతబాబుకు వీఐపీ ట్రీట్ మెంట్ అందుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ జైలుకు వచ్చిన రెండో రోజే పరుపు ఏర్పాటు చేయడంతో పాటు ఆయన కోరిన ఆహారం కూడా బయటి నుంచి తెప్పించి ఇస్తున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం చూస్తే.. ముగ్గురు ఖైదీల్ని ఒక్కో గదిలో ఉంచాల్సి ఉండగా.. అనంతబాబుకు మాత్రం విడిగా గది కేటాయించారు. జైలు నుంచి సెటిల్మెంట్లు చేసుకునేందుకు వీలుగా.. అక్కడే అపరమితంగా ములాఖత్ లకు అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagabushan Paina
    First published:

    తదుపరి వార్తలు