ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఓవైపు జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan kalyan)పర్యటన, మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్(Lokesh) టూర్‌తో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఎంతో ధీమాగా ఉన్న వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పుడే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా వైసీపీ(YCP)లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన కొడాలి నాని (Kodali nani), ఆర్కే రోజా(Rk roja), మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla ramakrishna reddy), ఉయ్యూరు శాసనసభ్యుడు కొలుసు పార్ధసారధి (Parthasaradi)కి సొంత వర్గం, సొంత నియోజకవర్గం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
కొడాలి సపోర్టర్స్ పార్టీ చేంజ్..
వైసీపీలో టీడీపీని ఓ రేంజ్లో విమర్శించిన నేతల్లో ముఖ్యలు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని . వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత , మంత్రి పదవిలో ఉండగా టీడీపీ , చంద్రబాబుపై విచ్చలవిడిగా నోరు పారేసుకున్న నాయకుడికి సొంత వర్గమే షాక్ ఇచ్చింది. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ తమకే అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దంటున్నారు కొడాలి నాని అనుచరులు. అందుకే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాని వర్గీయులు టీడీపీలో చేరారు. పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రావి వెంకటేశ్వరరావు వైసీపీకి సమాధి రాజకీయ సమాధి తప్పదన్నారు. గడ్డం గ్యాంగ్ అరాచకాలు ఇకపై సాగవన్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి తిరుగు లేదనుకుంటున్న తరుణంలో అనుచరవర్గమే పార్టీ మారడం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది.
అయోమయంలో ఆర్కే..
ఏపీ శాసనరాజధానిగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా మారింది. పార్టీలో మంచి వాగ్దాటి కలిగిన ఎమ్మెల్యే వాయిస్ గత కొద్ది రోజులుగా వినిపించడం లేదు. పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదనే టాక్ ఉంది. ఇప్పటం గ్రామంలో రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేసినా స్థానిక ఎమ్మెల్యేగా నోరు మెదప లేదు ఆర్కే.ఇలాంటి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని ఆయన అనుచరవర్గం కూడా మెల్లిగా పక్క పార్టీల వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్కేకి అనుచరుడిగా ఉన్న గొర్లె వేణుగోపాల్‌రెడ్డి నారా లోకేష్ సమక్షంలోనే టీడీపీలో చేరారు. లోకేష్‌ని ఓఢించిన నియోజకవర్గం నుంచే వలసలు పెరగడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పరిస్థితి అయోమయంలో పడ్డట్లైంది.
ఫైర్ బ్రాండ్‌కి బ్యాండేనా..?
ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మంత్రి వ్యవహారం, దుందుడుకు స్వాభావాన్ని అనుచరులు భరించలేకపోతున్నారు. ఈక్రమంలోనే సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి. రెండ్రోజుల క్రితం రోజా ప్రారంభించాల్సిన గ్రామసచివాలయంకు తాళాలు వేశారు వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి. మంత్రి అనుచరులు తాళాలు పగలగొట్టి కార్యక్రమాన్ని కొనసాగించడంతో వైసీపీలో ఉండటం కంటే టీడీపీలో చేరడమే బెటర్ అని ఆలోచిస్తున్నారట. కొందరు గాలి భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్‌కు టచ్‌లో ఉంటున్నారట.
నలుగురికి నలుగు తప్పదా ..
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఉయ్యూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్ధ సారధిపై కూడా నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. పార్ధసారధి ఆదివారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడవకొల్లు ఎస్సీ కాలనీకి వెళ్తే అక్కడి స్థానికులు నిలదీశారు. అర్హులకు ఇవ్వాల్సిన జగనన్న ఇళ్లు, ఇళ్ల స్తలాలు ఉన్నవాళ్లకే ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనీజీ సరిగా లేదని ,తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ పార్ధసారధిని సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే అధికారులను వివరణ అడిగి సమస్య పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kodali Nani, Rk roja, Ycp