Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MLA NALLAPUR REDDY PRASANNA KUMAR REDDY WISH TO NARA CHANDRABUABU NAIDU NGS

YCP MLA: చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు.. కాదంటూ మంత్రి విమర్శ.. ఒకే వేదికపై ఇద్దరూ ఇలా?

చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే

YCP MLA: ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరు వింటేనే.. అధికార పార్టీ నేతలు విరుచుకుపడతారు.. ఓ రేంజ్ లో తిట్ల దండకం అందుకుంటారు.. కానీ ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబును అభినందించారు.. అది కూడా పొరపాటున నోరు జారి కాదు.. మంత్రి సమక్షంలోనే.. అసలు ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...
    YCP MLA: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేరు వినిపిస్తే చాలు.. అధికార పార్టీ నేతలు అంత ఎత్తున లేస్తారు.. ఓ రేంజ్ లో ఆయనపై విరుచుకుపడతారు. కారణం లేకున్నా విమర్శలు చేస్తుంటారు. కొందరైతే బూతులు తిట్టడానికి కూడా వెనుకడారు.. కానీ అదే పార్టీకి చెందిన.. నెల్లూరు జిల్లా (Nellore District) కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) అభినందనలు తెలిపారు. అది కూడా పొరపాటున నోరు జారి మాత్రం కాదు.. స్వయంగా మంత్రి నారాయణస్వామి (Minster Narayna Swamy)ముందే చంద్రబాబును పొగిడారు. ఓ వైపు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబును అభినందిస్తే.. మంత్రి నారాయణ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ తతంగం జరిగింది. ప్రచారంలో భాగంగా రోడ్ షోలో మంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. మొదట ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే పదవీకాలం మధ్యలో మృతి చెంది ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే.. అక్కడ పోటీ పెట్టకూడదని టీడీపీ ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తుండటం మంచి విషయమన్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

    మరోవైపు, బీజేపీపై ఆయన మండిపడ్డారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినప్పుడు బీజేపీ నాయకులు సానుభూతి చెప్పారు.. కానీ ఇప్పుడు ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు బీజేపీ డిపాజిట్లు రావు అని తెలిసినా.. పోటీ ఎందుకు పెట్టడం అని ఆయన ప్రశ్నించారు. కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు గురించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదన్నారు. 

    అక్కడితోనే మంత్రి ఆగలేదు. తీవ్ర స్థాయిలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. కుట్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ విమర్శించారు. ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టకపోయినా.. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా రకరకాల కుట్రలకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు పెద్ద వెన్నుపోటుదారుడని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

    ఇదీ చదవండి : జనసేన అధినేత పవన్ కాన్వాయ్ పై రాజకీయం.. అధికార పార్టీ విమర్శలకు ధీటుగా కౌంటర్లు

    సంగం మండలంలో 2019లో 2వేల ఆధిక్యం మాత్రమే వైసీపీకి లభించిందని.. కానీ ఇప్పుడు 20 వేలకుపైగా ఆధిక్యం రావాలనే ప్రసన్నకుమార్ రె డ్డికి ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారని మంత్రి అన్నారు. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన గురించి తెలిసినవారంతా వైసీపీని గెలిపించాలని కోరారు. తన గెలుపుపై ఎలాంటి అపనమ్మకం లేదన్నారు. తనను ఆదరించిన గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bjp, Chandrababu Naidu, Nellore Dist, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు