AP POLITICS YCP MLA MALLADI VISHNU SLAMS AP BJP CHIEF SOMU VEERRAJU FOR DRAGGING GOVERNMENT INTO TEMPLES CONTROVERSY FULL DETAILS HERE PRN
BJP vs YCP: ఏపీలో ఆలయాలపై మళ్లీ మొదలైన రగడ.. బీజేపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు
సోము వీర్రాజు, మల్లాది విష్ణు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు కరెంటు మంటల నుంచి క్రమంగా ఆలయాల వైపు మళ్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లోని రామాలయంలో క్రైస్తవ ప్రార్థనలు, శ్రీశైలంలో కన్నడ భక్తులపై దాడి ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు కరెంటు మంటల నుంచి క్రమంగా ఆలయాల వైపు మళ్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లోని రామాలయంలో క్రైస్తవ ప్రార్థనలు, శ్రీశైలంలో కన్నడ భక్తులపై దాడి ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ రెండు ఘటనల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) చేసిన విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (YCP MLA Malladi Vishnu) ఘాటుగా స్పందించారు. సోము వీర్రాజు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలు కావాలనే మతవిద్వేషాలు రెచ్చగొడతున్నారని.. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా సోము వీర్రాజు మాట్లాడారా..? అని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని సీఎం వైఎస్ జగన్ పరిరక్షిస్తున్నారని విష్ణు స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు, మత రాజకీయాలతో ఏపీలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షాత్తూ పరమశివుడు కొలువైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రంపై సోమువీర్రాజు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలు బాధాకరమన్నారు మల్లాది విష్ణు. సోము వీర్రాజు చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే.. చంద్రబాబు అందించిన స్క్రిప్టులా ఉందన్నారు. సీఎం జగన్ పాలనలో హిందుత్వ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తి లేదని.. నిందితులపై చర్యలు కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్నారు.
సోము వీర్రాజుకు ఆయన నోరే శత్రువైందని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. చీప్ లిక్కర్ ఇచ్చి.. ఓట్లు అడిగే దౌర్బాగ్యస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారని విమర్శించారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని మల్లాది విష్ణు హెచ్చరించారు.
అంతకుముదు విజయవాడలో మాట్లాడిన సోము వీర్రాజు.. ఏపీలో హిందూ ఆలయాలకు రక్షణ లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేవాలయాల ప్రాంగణాల్లో అన్యమతస్తులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇదేమిటని అడిగితే కేసులు పెడుతున్నారని.., ఇలాంటి వారిపై బీజేపీ దూకుడు ప్రదర్శించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రా పురంలోని రామాలయంలో క్రైస్తవ కూటాలు నడుస్తున్నాయని స్థానికులు అడ్డుకుంటే కేసులు పెడతామంటున్నారు అంటే ఈ ప్రభుత్వానికి హిందువులను అణచి వేయాలన్న దుర్మార్గంతో ఉందా అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.