హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP MLA: డ్రెయినేజీలో దూకిన వైసీపీ ఎమ్మెల్యే.. అధికారులకు షాకింగ్ ట్రీట్ మెంట్..

YCP MLA: డ్రెయినేజీలో దూకిన వైసీపీ ఎమ్మెల్యే.. అధికారులకు షాకింగ్ ట్రీట్ మెంట్..

డ్రెయినేజీలో కూర్చున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

డ్రెయినేజీలో కూర్చున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

YCP MLA: అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదైనా సమస్య గురించి చెప్పారంటే అది ఖచ్చితంగా పరిష్కారం కావాలి. లేదంటా సదరు అధికారులపై చర్యలు తప్పవు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపిన సందర్భాలు చాలా తక్కువ.

ఇంకా చదవండి ...

అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదైనా సమస్య గురించి చెప్పారంటే అది ఖచ్చితంగా పరిష్కారం కావాలి. లేదంటా సదరు అధికారులపై చర్యలు తప్పవు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా వైసీపీ (YSRCP) కి చెందిన నెల్లూరు (Nellore) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) కి అధికారుల తీరుపై ఒళ్లు మండింది. దీంతో వినూత్న నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చేసిన పనికి అధికారులే కాదు అక్కడున్న వైసీపీ నేతలు కూడా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికీ పర్యటిస్తూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా ఆయన గడపగడపకు తిరుగుతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉమ్మారెడ్డి గుంటలో పర్యటించిన ఆయనకు డ్రైనేజీ సమస్య కనిపించింది. ఆ సమస్యపై ఆయన గత మూడేళ్లుగా అధికారులకు ఆదేశాలిస్తూనే ఉన్నారు. కానీ సమస్య మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నం చందంగా మారింది. మంగళవారం మరోసారి డ్రెయినేజీని పరిశీలించిన ఆయనకు కోపం నషాళానికి అంటింది. అధికారులపై ఆగ్రహంతో ఊగిపోకుండా.. ఉన్నట్లుండి డ్రెయినేజీలోకి దిగేశారు. అక్కడే కూర్చొని నిరసన తెలిపారు.


ఇది చదవండి: ప్లీనరీకి విజయమ్మ రాకపై సస్పెన్స్..! వైసీపీలో జోరుగా చర్చ..!

మూడేళ్లుగా డ్రెయినేజీ సమస్యపై ఫిర్యాదు చేస్తుంటే అధికారులు ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని.. ఇలాంటి వాటి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఉమ్మారెడ్డి గుంటలో డ్రెయినేజీ సమస్య ఎక్కువగా ఉందని.. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని కోటంరెడ్డి అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతుందని.. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని..., ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించినా రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని కోటంరెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళుగా అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదంటూ శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కార విషయంలో అధికారమా, ప్రతిపక్షమా అని ఉండదు... ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఎప్పుడూ నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించే కోటంరెడ్డి ఇలా నిరసనకు దిగడం అదర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో తన నియోజకవర్గానికి చెందిన అ యువతి కంటి చూపు కోల్పోయి ఇబ్బంది పడుతుండగా వెంటనే స్పందించిన కోటంరెడ్డి ఆమెకు మెరుగైన చికిత్స చేయించి కంటి చూపు వచ్చేలా చేశారు. అలాగే మరో వ్యక్తి అనారోగ్యం పాలవగా.. అంబులెన్స్ కంటే ముందే వచ్చి సాయం చేసి ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు కూడా ఏకంగా డ్రెయినేజీలో కూర్చొని నిరసన తెలిపి సమస్య తీవ్రత అధికారులకు తెలిసొచ్చేలా చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Nellore Dist

ఉత్తమ కథలు