హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP MLA: అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. అధికారులు మారుతున్నా పనులు మాత్రం కావడం లేదంటూ ఆవేదన..!

YCP MLA: అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్.. అధికారులు మారుతున్నా పనులు మాత్రం కావడం లేదంటూ ఆవేదన..!

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

YCP MLA: సాధరణంగా ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటారు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలే ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ, ప్రజా ప్రతినిధుల పనులు మాత్రం పూర్తి అవ్వడం లేదని మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

YCP MLA: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఆసహనంతో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy ) బహిరంగంగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా (Nellore District) అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ తన పనులు మాత్రం కావడం లేదని దుయ్యబట్టారు..

వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని.. దీంతో 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు. బారాషాహిద్ దర్గాకు 10 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనుమతి ఇవ్వలేదన్నారు. బీసీ భవన్ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయి అన్నారు. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు.

ఇక, వావిలేటి పాడులోని జగనన్న కాలనీలో పనులు సాగడం లేదన్నారు. నివాసయోగ్యంగా లేవు.. ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి అని నిలదీశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. హౌసింగ్ కాలనీలకు భూమి సేకరించినా వారికి ఇంకా పరిహారం ఇవ్వలేదు.. సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ దగ్గరకు వెళితే ఆయన పట్టించుకోలేదని.. కూర్చోమని కూడా చెప్పలేదన్న ఆయన.. ఒక ఎమ్మెల్యేనే అధికారులు పట్టించుకోవడం లేదు.. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. పొదలకూరు రోడ్ లో ఒక పక్కే రోడ్ వేశారు.. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. ఓవర్ లోడ్ వల్ల రహదారులు పాడైపోతున్నాయి.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : జీతాలు ఇవ్వాలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా..? విశాఖను ఆర్థిక, పర్యాటక కేంద్రగా తయారు చేస్తానన్న చంద్రబాబు

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.. పొట్టేపాలెం దగ్గర వంతెన కావాలని అడిగినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండేళ్ల క్రితం వంతెనకు అనుమతి వచ్చింది.. కానీ ఏమైందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో కొందరు ఐఏఎస్‌ అధికారుల కారణంగానే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదని ఆరోపించారు కోటంరెడ్డి.. అందుకే వాళ్లు టెండర్లు వేయడం లేదన్నారు.. అప్పటి పురపాలక మంత్రి బొత్సా సత్యనారాయణను ఆడిగామన్నారు. ఆయన శాఖ మారినా పనులు మంజూరు కాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Nellore, Ycp

ఉత్తమ కథలు