Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MLA GOLLABABU RAO MADE SENSATIONAL COMMENTS ON CM JAGAN AND PARTY FULL DETAILS HERE PRN

YCP MLA: అధిష్టానాన్ని దెబ్బకొట్టి తీరుతా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. కారణం ఇదే..!

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) లో చోటు దక్కని వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేల్లో ఇంకా అసంతృప్తి రగలుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలను సీఎం జగన్ (AP CM YS Jagan) తో పాటు పార్టీ అధిష్టానం బుజ్జగించినా.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పదవి దక్కకపోవడంపై మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) లో చోటు దక్కని వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేల్లో ఇంకా అసంతృప్తి రగలుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలను సీఎం జగన్ (AP CM YS Jagan) తో పాటు పార్టీ అధిష్టానం బుజ్జగించినా.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పదవి దక్కకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని, సుచరిత పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కకారు. ఎమ్మెల్యేల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారధి వంటి వారు అసంతృప్తుల జాబితాలో ఉన్నారు. వీరిని సీఎం జగన్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు బుజ్జగించి నచ్చజెప్పారు. ఐతే కొత్తమంత్రి వర్గం ఏర్పడి వారం రోజులు దాటినా అక్కడక్కడా వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

    తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంత్రి పదవిపై మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకుండా అధిష్ఠానమే దెబ్బకొట్టిందని.. ఛాన్స్ వస్తే తాను కూడా దెబ్బకొట్టితీరుతానంటూ సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాదు ఈ బోడి రాజకీయాలు నాకెందుకు.. ఇచ్చిన మాట కోసం పార్టీలోకి వెళ్లానని.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని త్యాగాలు చేసినా అమాయకుడ్ని చేసి పదవి ఇవ్వలేదన్నారు.

    ఇది చదవండి: "ఇప్పటివరకు ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క.." నగరిలో మంత్రి రోజా రాయల్ ఎంట్రీ.. వారికి వార్నింగ్


    పదవి ఇవ్వకపోతే నియోజకర్గంలోని లక్షలాది మందికి ఏ సమాధానం చెప్పుకోవాలని నిలదీశారు. తాను నూటికి లక్షశాతం హింసావాదినని.. ఈ మాట ఎక్కడైనా చెబుతా.. కావాలంటే జైలులో పెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు మంత్రి పదవి విషయంలో 70 కార్లలో 250 మంది వెళ్లి సజ్జలను కలిసినా న్యాయం చేయలేదన్నారు. వాళ్లు నన్ను దెబ్బకొడితే.. నేను వాళ్లను దెబ్బకొడతానంటూ ఘాటుగా హెచ్చరించారు.

    ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంట్ కోతలకు త్వరలోనే ముగింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..


    ఐతే ఇటీవల ఎమ్మెల్యేలు ఇలాంటి కామెంట్స్ చేస్తుండటం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీని విమర్శించినా.. ఆ తర్వాత సీఎం, ముఖ్యనేతలు మాట్లాడటంతో మెత్తబడ్డారు. ఇప్పుడు తనను పిలవలేనద్దన అక్కసుతోనే గొల్ల బాబూరావు ఇలాంటి కామెంట్స్ చేశారా..? లేక నిజంగానే అధిష్టానంపై తిరుగుబాటు చేయనున్నారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇది చదవండి: ఏపీలో వీరికి విద్యుత్ కోతల నుంచి మినహాయింపు.., గీతదాటితే వాతే..!


    ఇప్పటివరకు అసంతృప్తులను పిలిచి మాట్లాడుతున్న సీఎం జగన్.. బాబూరావును కూడా బుజ్జగిస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొత్త కేబినెట్ లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. అనకాపల్లి నుంచి గుడివాడ అమరనాథ్, మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడుకు మంత్రిపదవులు దక్కాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు