Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MLA GOLLA BABU RAO GIVES CLARITY ON HIS COMMENTS ABOUT CM JAGAN AND PARTY LEADERSHIP FULL DETAILS HERE PRN

YSRCP: తూచ్.. నేనలా అనలేదు..! అధిష్టానంపై యుద్ధం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ..!

మ్మెల్యే బాబూరావు (ఫైల్)

మ్మెల్యే బాబూరావు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) తర్వాత వైసీపీ (YSRCP) లో కీల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే.. తర్వాతి రోజు ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) తర్వాత వైసీపీ (YSRCP) లో కీల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే.. తర్వాతి రోజు ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో మాజీ మంత్రులు బాలినేని, సుచరిత, ఎమ్మెల్యేలు పిన్నెల్లి, ఉదయభాను తర్వాత రోజుకే మాట మారుస్తున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో అధిష్టానాన్ని దెబ్బకొడతానంటూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను హింసావాదిని కాదని.., అహింసావాదినని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవంమన్నారు. అధిష్ఠానం మీకు అన్యాయం చేసిందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అధిష్టానాన్నే అడగమని చెప్పానే తప్ప.. అధిష్టానం కు వ్యతిరేకం అని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

    2009 వరకూ నేను ప్రభుత్వ అధికారిగా పనిచేసిన తనను పిలిచి దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చారని..., అప్పటి నుంచి తాను వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటున్నానన్నారు. వైఎస్ మరణంతో మొదట రాజీనామా చేసిన ఎమ్మెల్యే తానేనని చెప్పింది. 2019లో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది నాపై చాలా రకాలుగా అధిష్టానంకు చెప్పినప్పిటికీ జగన్ తనపై నమ్మకముంటారన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడే వారి వెంట ఉన్న విధేయుల్లో నేను మొదటి వరుసలో ఉంటానని తెలిపారు.

    ఇది చదవండి: చంద్రబాబు సీఎం అయితే రాజకీయాలకు రిటైర్మెంట్.. టీడీపీ నేత సంచలన ప్రకటన


    కార్యకర్తల్లో ఆవేదనను తెలిజేసేప్రయత్నంలో ఇంతకు ముందు హింసావాదిగా ఉండే వాడిని ఇప్పుడు అహింసావాదిగా మరానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదన్నారు బాబూరావు. నియోజకవర్గంలో తనపై కుట్ర పూరిత రాజకీయం జరుగుతున్న మాట వాస్తవమే కానీ నేను వారికి గానీ అదిష్ఠానంకు గానీ ఎప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. కష్టం వస్తే నేనే స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను తప్ప ఇటువంటి ప్రచారాలు చేయనన్నారు. సీఎం జగన్ అందుబాటులో లేకపోతే సజ్జల రామకృష్ణ వారి ద్వారా అయినా నా కష్టంను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

    ఇది చదవండి: "ఇప్పటివరకు ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క.." నగరిలో మంత్రి రోజా రాయల్ ఎంట్రీ.. వారికి వార్నింగ్


    ఇదిలా ఉంటే సోమవారం తన నియోజకవర్గంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గొల్ల బాబూరావు.. తనను అధిష్టానం దెబ్బకొట్టిందని.. అందుకే తాను కూడా అధిష్టానాన్ని దెబ్బకొడతానంటూ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వైసీపీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో గొల్ల బాబూరావు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఐతే అధిష్టానంపై నిజంగానే అసంతృప్తి వెళ్లగక్కారా.. లేక డ్యామేజ్ కంట్రోల్ కు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారా అనేది చర్చనీయాంశమైంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు