AP POLITICS YCP MLA GADIKOTA SREEKANTH REDDY SLAMS NARA CHANDRABABU NAIDU KUPPAM TOUR FULL DETAILS HERE PRN
AP Politics: ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో చంద్రబాబు.. ఇదే వింత విచిత్ర రాజకీయం..! టీడీపీపై వాయిస్ పెంచిన వైసీపీ..!
చంద్రబాబు, జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాటల తూటాలు గట్టిగానే పేలుతున్నాయి. నిత్యం ఏదో ఒక అంశంపై అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఓ రేంజ్ లో మాటవల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాటల తూటాలు గట్టిగానే పేలుతున్నాయి. నిత్యం ఏదో ఒక అంశంపై అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఓ రేంజ్ లో మాటవల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏకంగా సీఎం జగనే.. నా దెబ్బకు బాబు కుప్పం పరిగెత్తాడంటూ ఎద్దేవా చేశారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. టీడీపీ అధినేతపై మండిపడ్డారు. కుప్పం ప్రజలు కూడా బాబును నమ్మడం లేదని.. ఆయన సభలకు జనం రాకపోవడంతో చిన్నపిల్లలతో జేజేలు కొట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తప్పుచేసిన వారిని వెనకేసుకొస్తూ వారిని శిక్షించకూడదనేదే బాబు విధానామా అని ఆయన ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థలు నారాయణవికాక మరెవరివి..? అని నిలదీశారు.
40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాయబం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఏనాడైనా ప్రజలకు మంచి చేసి ఉంటే... ఈ ఖర్మ పట్టేది కాదు కదా.. అని కుప్పం జనాలే అనుకుంటున్నాన్నారు. తన సభల్లో యువతను, విద్యార్థులను రెచ్చగొడుతూ... ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. మీకు పౌరుషం లేదా, మీరు నిద్రపోతారా.. అని యువతను రెచ్చగొడుతూ, మరోవైపు పోలీసులను, అధికారులను బెదిరిస్తూ, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ప్రసంగాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో టీడీపీకి చెందిన వారే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడటం అక్కడికి వెళ్లి ప్రభుత్వంపై బురదజల్లడం అలవాటైపోయాయన్నారు. నిందితులపై కేసులు పెడితే.. మళ్ళీ వీరే కక్ష సాధింపులు అని మీటింగులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం వంటి వింత, విచిత్ర రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు మాల్ ప్రాక్టీస్ కు వీళ్ళే పాల్పడతారు. దీనికి ప్రధాన సూత్రధారి అయిన ఆ సంస్థల అధినేత నారాయణను ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్టు చేస్తే.. మళ్ళీ ఇదే చంద్రబాబు ఆయనను వెనకేసుకొస్తూ ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకూ చేరుతుంటో, ఇక తన పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే బాధ, భయంతో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పథకం కూడా శాచురేషన్ విధానంలో అమలు కాలేదని., కొత్తగా ఏ పథకం కూడా అమలు చేయకపోయినా, ఉన్న పథకాలలో కూడా కత్తెర వేసి, కోతలు కోసిన చరిత్ర ఆయనదన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.