హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP MLA: కోర్టు అలా ఆదేశాలిస్తే.. ఎన్నికలు ఎందుకు? ఆ అధికారం న్యాయవ్యవస్థకు లేదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

YCP MLA: కోర్టు అలా ఆదేశాలిస్తే.. ఎన్నికలు ఎందుకు? ఆ అధికారం న్యాయవ్యవస్థకు లేదు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

YCP MLA: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజకీయం కోర్టువైపు మళ్లింది.. న్యాయస్థానం వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారుతోంది. మూడు రాజధానుల విషయంలో మళ్లీ ప్రభుత్వం న్యాయస్థానాల మధ్య వార్ తప్పేలా లేదు. తాజపాగా సీఎం జగన్ సహా.. ఇతర ఎమ్మెల్యేలు మూడు రాజధానునల విషయంలో ఇటీవల కోర్టు తీర్పును తప్పు పట్టారు.

ఇంకా చదవండి ...

  YCP MLA: మూడు రాజధానుల  (Three Capitals) విషయంలో వెనక్కు తగ్గేదే లే అంటోంది ఏపీ ప్రభుత్వం (AP Government).. అంతేకాదు ఈ సారి ఏకంగా న్యాయవ్యవస్థపై పోరాటానికి సిద్ధమైంది. అందుకే ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ వేదికగా.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ వైసీపీ నేతలు(YCP Leaders) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు (Darmana Prasad Rao) అయితే ఓ అడుగు ముందుకేసి న్యాయస్థానం అలాంటి తీర్పు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశంలో కోర్టు జోక్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు అని ఇలదీశారు. ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని.. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ తెలిపిందని అసహనం వ్యక్తం చేశారు. హై కోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి తానులేఖ రాశానని.. కోర్టులంటే అందరికి గౌరవం ఉందని.. అయితే దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని తాను భావిస్తున్నా అని చెప్పారు ధర్మాన అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని సుప్రీంకోర్టు (Supreem Court) చెప్పిందన్నారు. అలాగే లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉందన్నారు.

  రాజ్యంగం ప్రకారం ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి అని సూచించారు. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయన్నారు. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని తీర్పులు ఎన్నో చెప్పాయని గుర్తు చేశారు ధర్మాన ప్రసాద్‌రావు. ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు.. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

  అలాగే ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడించారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గంతో చెప్పిందన్నారు. సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. జ్యుడీషియల్‌ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని వెల్లడించారు ధర్మాన ప్రసాద్‌రావు. చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న శాస‌న వ్య‌వ‌స్థ‌దే’ అంటూ ఏపీ అసెంబ్లీలో ధ‌ర్మాన ప్రసాదరావు వ్యాఖ్య‌ానించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని మరోసారి గుర్తు చేశారు.

  హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని కూడా ధర్మాన తెలిపారు. మూడు రాజధానులు విషయం గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను అని అన్నారు. ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమేనని..ఇది సరైంది కాదని సూచించారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, AP News

  ఉత్తమ కథలు