Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MLA AMBATI RAMBABU SLAMS TO CHANDRABABU NAIDU HE SAID PEGASUS BUY BY TDP CHIEF NGS

Pegasus Fighting: పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నది చంద్రబాబే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

పెగాసస్ కొన్నది చంద్రబాబే అంటూ అంబటి విమర్శ

పెగాసస్ కొన్నది చంద్రబాబే అంటూ అంబటి విమర్శ

Pegasus Fighting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెగాసస్ వివాదం రచ్చ రచ్చ అవుతోంది.. పశ్చిమ బెంగాల్ మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతతో తమకు ఎలాంటి స్నేహం లేదని.. అయినా ఆమె వ్యాఖ్యానించారంటే అది నిజమే కదా అని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి ...
    Pegasus Political Fight:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  పెగాసస్ వివాదం దుమారం రేపుతోంది.  పెగాసస్ సాఫ్ట్ వేర్ (Pegasus Software) కొనుగోలు ఆరోపణలపై రాజకీయ రచ్చ మొదలైంది.  రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచేందుకు అక్రమంగా ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్షాలు.. కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై ఇటీవల ఆరోపణలు చేశాయి. తాజాగా ఆ వివాదం ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.  పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee).. పెగాసస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం పెగాసస్ ను కొనుగోలు చేయాల్సిందిగా ఆఫర్ వచ్చిందని తాము నిరాకరించామని చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.

    తాజా వివాదంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీకి ఆద్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి పని చేయలేదు అంటే ఎవరూ నమ్మరన్నారు. మమతా బెనర్జీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు అలాంటి ఆమె శాసనసభలో సీఎం హోదాలో అధికారికంగా చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని బయట పెట్టారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ విషయంతో సంబంధం లేకుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

    ఇదీ చదవండి : భర్తతో కలసి రోజా వ్యాయామాలు చూశారా..? ఫులో జోష్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్

    వైసీపీ ప్రోద్బలంతో ఆమె ఆరోపణలు చేయడనాకి.. ఆమెతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవన్న విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పని చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే లోకేష్ ఎందుకు పరువునష్టం కేసు వేయటం లేదని నిలదీశారు. సాక్షి పత్రిక ఒక కథనం రాసిందని పరువు నష్టం కేసు వేశారుగా.. మరి మమతా బెనర్జీపై ఎందుకు కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోందన్నారు.

    ఇదీ చదవండి : ఏపీలో చంద్రబాబు పెగాసస్ రచ్చ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఆమోదం.. ఏం జరుగుతోంది..

    తాజా వివాదంపై వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధుల పై టీడీపీ నిఘా పెట్టిందని దీనిని బట్టి అర్ధం అవుతోంది అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరో సలహాలు ఇస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారనటం అనైతికం అన్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావు ద్వారా మా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళారు. పార్టీ కార్యకర్తలా పని చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలు వినటం వల్లే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు శంకరగిరి మాన్యాలు పట్టుకుని వెళ్ళారని అంబటి ఆరోపించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు