హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కోట్ల విలువైన ఫర్నీచర్ తీసుకెళ్లిన కోడెల... వైసీపీ ఎమ్మెల్యే అంబటి

కోట్ల విలువైన ఫర్నీచర్ తీసుకెళ్లిన కోడెల... వైసీపీ ఎమ్మెల్యే అంబటి

కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు.

    కోడెల మరణంతో చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నం చేశారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. గతంలో కోడెల ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు చంద్రబాబు ఈ రకమైన పోరాటం చేసి ఉంటే ఆయన బతికేవారని వ్యాఖ్యానించారు. కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు అబద్దాలు చెప్పే సమయంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. పార్టీ మనిషి చనిపోతే మిగతా నాయకుల్లో భాద, భావోద్వేగం కనిపిస్తుందని... కానీ అ బాధ చంద్రబాబులో కనిపించలేదని అంబటి దుయ్యబట్టారు. కోడెల విషయంలో చంద్రబాబు చట్టం ప్రకారం చర్యలు తీసుకోమని గతంలో అన్నారని గుర్తు చేశారు.

    చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. .కోడెల కుటంబ సభ్యలు మీద కేసులు నమోదు చేశారు కానీ విచారణ చేయలేదని అంబటి అన్నారు. కోడెల తీసుకెళ్ళింది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదని అంబటి రాంబాబు అన్నారు. అది కొత్త అసెంబ్లీలో ఫర్నిచర్ కాదని...హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న పురాతనమైన ఫర్నిచర్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల విలువ చేసే 114 వస్తువులను కోడెల తీసుకెళ్లారని అంబటి రాంబాబు అన్నారు. లక్ష 27 వేల గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారని... పేపర్ లీక్ అయితే లీక్ అయిన రోజే వార్త ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఒక పిచ్చి పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు.

    First published:

    Tags: Ambati rambabu, Kodela death, Kodela Siva Prasada Rao, TDP, Ysrcp

    ఉత్తమ కథలు