Minister Roja: సింహంతో వేట.. జగన్ అన్నతో ఆట మంచిది కాదు.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే.. ఇవేవో సినిమాలోని డైలాగ్ లు కాదు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా (Minster RK Roja) పేలుస్తున్న మాటల తూటాలు. ముఖ్యంగా మళ్లీ రోజా మునిపటి ఫాంలోకి వచ్చేశారు. ఫైర్ బ్రాండ్ ముద్రను కొనసాగిస్తున్నారు. ఆ మధ్య మంత్రి పదవి లేదన ఆవేదన, సొంత పార్టీ నుంచి గ్రూపులతో కాస్త సైలెంట్ గా కనిపించిన ఆమె.. మంత్రి పదవి వచ్చాక.. మళ్లీ పైర్ ను బయటకు తీస్తున్నారు. రోజా అంట ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ (Chief Minster Jagan) అని మంత్రి రోజా కొనియాడారు. నగరిలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే రోజా, ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను కొనియాడరని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అవసరాల కోసం ప్రస్తుతం చంద్రబాబు.. పొత్తుల పేరుతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బీజేపీ (BJP) కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరితో కలిసి ఇంకా ఎంతమంది వచ్చినా సింహంతో ఆట, జగన్ తో వేట జరిగే పని కాదన్నారు.
విపక్షాలన్నీ ప్రస్తుతం అప్పులు అంటూ గగ్గోలు పెడుతున్నాయని.. కానీ గత ప్రభుత్వంలా తాము దుబారాల కోసం ఖర్చులు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసమే కొన్ని అప్పులు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. జగన్ ను ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు నాయుడు బీజేపీ నేతల కాళ్లు పట్టుకోవడానికి, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారని రోజా ఆరోపించారు. వారంతా గుంపులు గుంపులుగా పందుల్లా.. సింహంతో పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అయిత సింహం వేటాడటం ఖాయం అన్నారు.
ఆడపిల్ల అని చూడకుండా విష ప్రచారం చేస్తున్నారంటూ మండి పడిన రోజా ఒక్కొక్కరికి బాక్స్ లు బద్దలు కొడతాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 12 సంవత్సరాలుగా ఎన్నో కుట్రలు చేశారని, అయినప్పటికీ వాటిని ఎదిరించి నిలబడిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా కొనియాడారు. జగన్ అంటేనే బ్రాండ్ .. సంక్షేమ పథకాల సామ్రాట్ ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా వెన్ను చూపకుండా మొక్కవోని ధైర్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు. వైయస్సార్ చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు చిదిమి వెయ్యాలని చూశారని, కానీ వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ముందుకు నడిచారు అని రోజా పేర్కొన్నారు.
సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సీఎం జగన్ అందించారని పేర్కొన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ, ప్రధానితో సహా ప్రశంసలందుకున్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని రోజా పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగలేదని రోజా మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇచ్చారా అంటూ రోజా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చర్చించే దమ్ముందా అంటూ రోజా సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Ycp