Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MINSTER AMBATI RAMBABU SLAMS PAWAN KALYAN AND CHADRABABU WILL RELEASE CHANDRABBU DATTAPUTRUDI MOVIE NGS

Ambati Rambabu: సిల్వర్ స్క్రీన్ పై చంద్రబాబు దత్తపుత్రుడి సినిమా.. హీరోయిన్లు ఎంతమంది అంటే..?

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ సినిమా తీస్తాం

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ సినిమా తీస్తాం

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడిగా వైసీపీ అభివర్ణిస్తోంది. అయితే వారి వ్యాఖ్యలపై పవన్ సైతం సీరియస్ అవుతున్నారు.. తను అలా పిలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. దీంతో అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేసి.. చంద్రబాబు దత్తపుత్రుడి పేరుతో సినిమా తీస్తామంటోంది.. మరి నిజంగానే వైసీపీ నేతలు అన్నంత పని చేస్తారా..?

ఇంకా చదవండి ...
    Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల హాడావుడి కనిపిస్తోంది. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నా అన్ని పార్టీల్లో ఎలక్షన్ జోష్ కనిపిస్తోంది. ఎవరికి వారు తమ వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇక అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే పీక్ కు చేరిందనే చెప్పాలి. మొన్నటి వరకు కౌంటర్ కు ఎన్ కౌంటర్ అనేలా పరిస్థితి ఉంటే.. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు హీటు పుట్టేలా చేస్తున్నాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తమకు ప్రత్యర్థే కాదని చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు (YCP Leaders) ఇప్పుడు రూటు మార్చారు.. టీడీపీ (TDP)-జనసేన (Janseana)పొత్తుపై ప్రచారం మొదలైన దగ్గర నుంచి పవన్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. చంద్రబాబు (Chandrababu)కు పవన్ దత్తపుత్రుడని విమర్శిస్తున్నారు. కన్న కొడుకుపై చంద్రబాబుకు నమ్మకం లేకపోవడంతో దత్త పుత్రుడ్ని రంగంలోకి దింపారని విమర్శిస్తున్నాయి. అయితే వీటిపై పవన్ కూడా అదే స్థాయిలో ఫైర్ అవుతున్నారు. తనను దత్తపుత్రుడు అంటే.. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రులు అనాలని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి తనను దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. కానీ వైసీపీ నేతలు మాత్రం మరింత దాడి పెంచారు. ఈ సారి చంద్రబాబు దత్తపుత్రుడు పేరుతో ఏకం సినిమా తీస్తామంటున్నారు.

    కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు (Minster Ambati Ramababu) సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది అన్నారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి విషయాలు ఏవీ పవనకు తెలియవని ఫైర్ అయ్యారు.

    ఇదీ చదవండి : అనుభవించు రాజా.. అశ్వాలు, గజరాజులకు షవర్ బాత్.. ఎలా ఎంజాయ్ చేస్తున్నాయంటే?

    అసలు ఆయన చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని విమర్శించారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు.. తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను పావుగా వాడుకుని కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎరగా వేస్తున్నారని ఆరోపించారు.

    ఇదీ చదవండి : కోనసీమ మజాకా.. కాబోయే కోడలికి 100 రకాల స్వీట్స్ సారె.. చూస్తేనే నోరూరుతుంది

    ముఖ్యమంత్రి కావాలని తనకు లేదు అన్న పవన్ కళ్యాణ్ మాటలు వాస్తవమే అని.. ఎందుకంటే చంద్రబాబును గద్దెను ఎక్కించటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు వైసీపీపై సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడికే ఉంటుందా.. తమకు ఉండదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రీన్ ప్లే రాయటం మాత్రమే వచ్చు అని.. తమకు సినిమా తీయటం కూడా వచ్చాన్నారు. అందుకే త్వరలో చంద్రబాబు దత్తపుత్రుడు అనే టైటిల్‌తో సినిమా తీస్తామని అంబటి రాంబాబు సెటైర్ వేశారు. కానీ ఈ సినిమాకు ఐదారుగురు హీరోయిన్లు కావాలని నిర్మాతలు ముందుకు రావటం లేదని కామెంట్ చేశారు.

    ఇదీ చదవండి : సిల్వర్ స్క్రీన్ పై చంద్రబాబు దత్తపుత్రుడి సినిమా.. హీరోయిన్లు ఎంతమంది అంటే..?

    ధైర్యం, దమ్ము ఉన్న నాయకుడు జగన్ అని.. ఆయన్ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ వల్ల కాదన్నారు. పవన్ కు ప్యాకేజీలు ఇస్తున్న చంద్రబాబు వల్ల కూడా కాదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి కక్షకట్టి కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో నిలబడి పోరాడిన నాయకుడు జగన్ అని వివరించారు. అరెస్టుకు, కన్వెన్షన్‌కు తేడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు విమర్శించారు.

    ఇదీ చదవండి : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ..? పార్టీ ఏదీ.. పోటీ ఎక్కడ? ఆంధ్రా ఆక్టోపస్ క్లారిటీ

    ఇటు తమపై వ్యంగ్యంగా మాట్లాడే పవన్.. తనపై మాత్రం సెటైర్లు వేయవద్దంటున్నారు. తనను రాంబో రాంబాబు అనలేదా?" అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తెల్ల మొహం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కంటిన్యూగా చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్‌కు చిర్రెత్తుకు వచ్చింది. తనను అలా అనొద్దు అని కామెంట్ చేశారు. దీనిపై అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, AP Politics, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు