AP POLITICS YCP MINSTER AMARNATH HOT COMMENTS ON PAWAN KALYAN AND CHANDRABABU NAIDU NGS VSP
YCP Minster: జనసేన కాదు ధనసేన.. పవన్ రాజకీయ నాయకుడు కాదు.. ఆప్షనల్ పొలిటీషియన్..
మంత్రి గుడివాడ అమర్ నాథ్ (File)
YCP Minster: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు, కొందరు మంత్రులు జనసేన నేత పవన్ టార్గెట్ చేస్తున్నారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరో మంత్రి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆప్షనల్ పొలిటీషియన్ అంటూ ఆరోపించారు.
YCP Minster: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) లో మంత్రులు.. కొందరు నేతలు.. జనసేన (Janasena) ను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కేబినెట్ లో మంత్రిగా ఉన్న పేర్ని నాని (Perni Nani) .. జనసేనానిపై కౌంటర్లు వేసేవారు.. ఇప్పుడు ఆయన మాజీ అవ్వడంతో.. ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Minster Gudivada Amarnath).. పవన్ పై విమర్శలు చేస్తున్నారు. తాజా మాట్లాడిన ఆయన.. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దేశం (Telugu Desam) పైనా..? జనసేన పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీ గుంచి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదన్నారని అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. నాలుగు పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి మోసం చేసిందన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిలా సీఎం జగన్ కు పబ్లిసిటీ పిచ్చి లేదన్నారు.. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతారని.. గొప్పలు చెప్పుకునే అలవాటు అసలు లేదన్నారు. అందుకే పరిశ్రమ గ్రౌండ్ అయిన తర్వాతే ప్రకటించాలని తమకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. టీడీపీలో కేవలం మాట్లాడినంత మాత్రానే పరిశ్రమలు వచ్చేస్తున్నాయని చెప్పుకుంటే.. ఇప్పటికే చాలా ఉండేవని అమర్ నాథ్ అన్నారు. మాట్లాడితే బిడ్డలు పుడతారా.. మాటలతో పనులు అవుతాయా అని మంత్రి ప్రశ్నించారు.
విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 300 అంశాలను పరిశీలించిన తరువాతే.. కేంద్రం ర్యాంకింగ్స్ ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అంతేకాకుండా పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారన్నారు. ఏపీ అభివృద్ధిని చూడలేకే విపక్షాలు.. వారి మద్దతుదారులు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమైందని, 4 లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన ఘనత వారిదని మండిపడ్డారు.
ఇక పవన్ కళ్యాణ్ పై నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. జనసేనను ధన సేనగా ఆయన అభివర్ణించారు. జనవాణిని ధనవాణిగా చెప్పుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ ను రాజకీయ నేత అనడం అనవసరం అన్నారు. ఎందుకంటే ఆయన ఆప్షనల్ పొలిటీషియన్ అని ఆరోపించారు. ఆప్షన్లతో రాజకీయాలు చేసే వాళ్ళు చరిత్రలో ఉంటారా అని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లలో ఎనిమిది పార్టీలతో పని చేసిన వ్యక్తి ప్రపంచంలోనే ఎవరూ ఉండరని విమర్శించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.