AP Ministers on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ వాతావరణం సెగలు కక్కుతోంది. ముఖ్యంగా రాజధాని రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. ముఖ్యంగా విశాఖ (Visakha) వేదికగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), వైసీపీ (YCP) మంత్రులు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఎయిర్ పోర్టు (Visakha Airport) లో మంత్రులపై దాడి ఘటన తరువాత.. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మేం తలుచుకుంటే..? పవన్ ఏపీలో తిరగ్గలరా అని వార్నింగ్ ఇచ్చారు. ఇదే పరిస్థితి ఉంటే తీవ్ర పరిణమాలు చెల్లించుకోక తప్పదని మంత్రులు హెచ్చరించారు. దానికి ఘాటుగానే పవన్ స్పందించారు. కోడికత్తిలాంటి ఘటన రిపీట్ చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని.. అసలు తాను ఎయిర్ పోర్టుకు వచ్చే టైంలో.. మంత్రులు వచ్చారు అంటే..? వెనుక ఏదో స్కెచ్ ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
పవన్ వ్యాఖ్యలతో మంత్రులు మరింత ఘాటుగా స్పందించారు. పవన్ ను రాజకీయ ఉగ్రవాది అంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. ఆయన పార్టీలో ఉన్నవారు కూడా సైకోలు అంటూ ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విరోధిగా మారారన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీనే జనసేన సిద్ధాంతం అన్నారు. అలాగే సినిమా నటుల పర్యటనలు అంటే.. అభిమానంతో భారీగా ప్రజలు వస్తారని.. వారంతా ఓట్లు వేస్తారు అనుకుంటే..? పొరాపాటే అన్నారు. అలా వచ్చిన జనాలు అంతా ఓట్లు వేస్తే కేవలం సినిమా హీరోలే రాజకీయాల్లో రాణిస్తారు కదా అని ప్రశ్శించారు.
మూడు పెళ్ళిల విషయం మేము ప్రస్తావన తీసుకు రాలేదని.. కానీ తాజాగా పవన్ మాటలు చూస్తే 3 పెళ్లిల్లే ఆయన విధానం అనిపిస్తోంది అన్నారు. యువతని పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని.. వైసీపీది మూడు రాజధానుల విధానం అయితే..? జనసేన పార్టీది మూడు పెళ్లిల విధానమంటారు. ప్రజా ప్రతినిధుల మీద దాడి చేయడం రాజ్యంగంలో ఉందా..? అలాంటి సంఘటనలు సమర్ధించడం మంచి పద్ధతేనా అని ప్రశ్నించారు. మీరు విశాఖలో ఎన్ని రోజులు ఉన్న అభ్యంతరం లేదు.. కానీ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తున్నారు కాబట్టే పోలీసులు నోటీసులు ఇచ్చారని అమర్ నాథ్ అభిప్రాయపడ్డారు.
మంత్రి బొత్స కూడా ఘాటుగానే ఫైర్ అయ్యారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వద్దన్న ప్రతి ఒక్కరూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. నిన్న జరిగిన విశాఖ గర్జన విజయవంతమైందని.. విశాఖ పరిపాలన రాజధాని కోసం స్వచ్ఛందంగా వచ్చి అంతా గర్జనలో పాల్గొన్నారని.. ఎవరైతే విశాఖ రాజధాని వద్దని చెబుతున్నారో వాళ్ళకి నిన్న జరిగిన గర్జన ఒక కనువిప్పు కలిగించింది అన్నారు. రాష్ట్రంలో కొంతమంది క్షుద్ర రాజకీయాలు చేస్తారాని అన్నారు.
కొన్ని మీడియా సంస్థలు ఉత్తరాంధ్రపైన ఎందుకంత కక్ష కట్టాయని బొత్స ప్రశ్నించారు.
ఇదీ చదవండి : విశాఖ విడిచి వెళ్లాలి అంటూ పవన్ కు 41ఏ నోటీసులు.. పోలీసులు ఏమన్నారంటే..?
విశాఖపట్నంకి అర్దిక రాజధాని కావాలా, వద్దా అని ప్రతి ఇంటింటికి వెళ్లి మీరు అడిగితే తెలుస్తుందన్నారు. జనసేన పార్టీకి ఒక విధానము లేదని రాజకీయ పార్టీ ఉండాల్సిన అంశాలు సిద్ధాంతము పవన్ కి లేవన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ఎందుకు వద్దంటారో పవన్ చెప్పాలని నిలదీశారు. గతంలో ఉత్తరాంధ్రలో గాజువాక నుండి పోటీ చేసిన మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఓ రాజకీయ వేత్తగా మీ ముందుచూపు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Pawan kalyan, Vizag, Ycp