Home /News /andhra-pradesh /

AP POLITICS YCP MANGALAGIRI MLA ALLA RAMAKRISHNA REDDY TURNED A FARMER HIS OWN FARMING NGS GNT

MLA turned Farmer: ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా..? అధికార పార్టీ నేత అయినా.. వ్యవసాయంతో బిజీ బిజీ

రైతుగా మారిన ఎమ్మెల్యే

రైతుగా మారిన ఎమ్మెల్యే

MLA turned Farmer: ఇక్కడ తలపాగా వేసుకుని.. వ్యవసాయ పనులు చేస్తున్న వ్యక్తి సాధారణ రైతు కాదు.. ఆయన ఓ ఎమ్మెల్యే.. అదికూడా అధికార పార్టీకి చెందిన కీలక నేత.. టీడీపీ ఫ్యూచర్ నేత.. మాజీ మంత్రిపై విజయం సాధించారు.. ఇప్పుడు ఓ సాధారణ రైతులా అందరితో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరో గుర్తు పట్టగలరా..?

ఇంకా చదవండి ...
    MLA turned Farmer: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికార వైసీపీ (YCP)  లో 151 ఎమ్మెల్యేలు నెగ్గినా.. అందులో కొందరి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (MLA RamaKrishna Reddy) .. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనయుడు.. భవిష్యత్తు నాయకుడిగా చెప్పుకునే నారా లోకేష్ (Nara Lokesh)  పై ఆయన గెలుపొందారు. అయినా ఆ హోదా ఎక్కడా కనిపించనీయరు.. ఆయన రూటే సపరేటు.. సామాన్యుల్లో సామాన్యుడిగానే ఉండడానికి ఇష్టపడతారు. ఎమ్మెల్యే అయినా నిత్య కృషీవలుడిగా ఉండడానికే ఇష్టపడతారు.. ముఖ్యంగా ఓ రైతులో పొలంలో దిగి వ్యవసాయం చెయ్యటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఏపీలో వర్షాలు పడుతున్న క్రమంలో ఖరీఫ్ సీజన్ కావటంతో ఏరువాకా సాగారో అంటూ ఇలా వ్యవసాయం పనుల్లో నిమగ్నమయ్యారు. తాను ఎమ్మెల్యేను కదా అని హోదా ప్రదర్శించలేదు. రైతు కూలీలను పిలుపించుకునే చేయించే స్థోమత ఉన్నా.. ఆయనే స్వయంగా వ్యవసాయం చేస్తూ.. రైతాంగానికి ఆదర్శంగా మారారు. మట్టిని నమ్ముకున్న రైతుగా ఆయన ఉండడానికి ఇష్టపడతారు. వేసుకున్న ఖద్దరు చొక్కా నలగకుండా, కారు నుండి కాలు కింద పెట్టకుండా రాజకీయాలు చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. మట్టిని నమ్ముకుని ఒక రైతుగా వ్యవసాయం చేయడం అంత సామాన్య విషయం కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేని అని గర్వం లేకుండా అతి సామాన్యంగా వ్యవహరించటం ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మాత్రమే ప్రత్యేకం..

    అయితే ఇప్పుడే కాదు.. మొదటి నుంచి ఆయనకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం.. ఎమ్మెల్యేగా నెగ్గిన తొలి నాళ్లలో సైతం ఇలా పొలంలో దుక్కి దున్ని.. విత్తు నాటి.. వరి చేను కోసి.. పలు సందర్భాల్లో ఆయన రైతు పాత్రలోనే కనిపించారు. అందరిలా ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా..? చెమటోడ్చి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. అందుకే ఆయనను ప్రజల మనిషిగా ఆయన అభిమానులు భావిస్తారు.

    ప్రజల్లో సాధారణ మనిషిలా కలిసి ఉండడంతోనే ఆయనకు అంత గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు తోనే గత ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు లోకేష్ పోటీ చేసినా ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యేగా ఆయన బిజీగా ఉండాల్సిన సమయం.. ఎందుకంటే ఇప్పటికే సీఎం జగన్ అందరికీ వ్యక్తిగంతా టార్గెట్లు పెట్టారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా బిజీగా ఉన్న సమయంలోనూ ఆర్కే.. వ్యవసాయాన్ని మాత్రం ఇష్టంగానే చేస్తున్నారు. 



    నేడు చాలా మంది రైతులు సైతం ఆమడ దూరం పారిపోతుంటే ఆయన మాత్రం వ్యవసాయంపై మక్కువతో సాగు పనుల్లో బిజీగా ఉంటారు. కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు.సీజన్ వస్తే చాలు రైతుగాపొలం పనులు చేస్తూ వ్యవసాయం పట్ల తన ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఈ పని, ఆ పని అన్న తేడా లేకుండా వ్యవసాయ పనులన్నీ చేస్తూ ఆర్కే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఎమ్మెల్యే గిరీ పక్కన పెట్టి తలపాగా చుట్టి రైతుగా మారుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Alla Ramakrishna reddy, Andhra Pradesh, AP News, Farmer, Mangalagiri, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు