Home /News /andhra-pradesh /

AP POLITICS YCP LEADERS USE TO MEGASTAR CHIRANJEEVI NAME IS THERE ANY POLITICAL STRATEGY NGS

YCP MLA: చిరంజీవిని వాడేసుకుంటున్న వైసీపీ.. రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

సీఎం జగన్ -మెగాస్టార్ చిరంజీవి (ఫైల్)

సీఎం జగన్ -మెగాస్టార్ చిరంజీవి (ఫైల్)

YCP MLA: టాలీవుడ్ పెద్దన్న.. మెగా స్టార్ చిరంజీవిని ప్రభుత్వం దగ్గర చేసుకోవాలని చూస్తోందా.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. చిరంజీవిపై అధిక ప్రేమ చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇటీవల టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం వివాదంలో చిరంజీవే అన్నీ తానై వ్యవహరించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సైతం చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    YCP MLA: వచ్చే ఎన్నికలకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నుంచి కాస్త పోటీ తప్పదని వైసీపీ (YCP)భావిస్తోంది. ఒకవేళ టీడీపీ (TDP)-జనసేన (Janasena) కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఒక వేళ అదే నిజమైతే వైసీపీ గట్టి పోటీ తప్పదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే పవన్ క్రేజ్ కాస్త డ్యామేజ్ చేయాలి అంటే.. ఆయన అన్న చిరంజీవిని (Chiranjeevi) దగ్గర చేసుకోవడమే మేలను వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇటీవల చిరంజీవిని వైసీపీ దగ్గర చేసుకుంటుందనే ప్రచారం ఉంది. ఆ మధ్య చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రచారాన్ని స్వయంగా చిరంజీవే ఖండిచారు. ఇక టాలీవుడ్ -ఏపీ సర్కార్ మధ్య వ్యవహారంలోనూ చిరంజీవి అన్నీ తానై వ్యవహరించారు. మెగాస్టార్ జోక్యంతోనే.. టాలీవుడ్ వివాదం ముగిసింది.. ఆ వెంటనే ప్రభుత్వంపై చిరంజీవి ప్రసంసలు కురిపించడం.. మెగాస్టార్ ను ప్రభుత్వం పొగడ్తల్లో ముంచెత్తింది. ఇక పవన్ కల్యాణ్ సైతం ఆయన అన్నయ్య చిరంజీవిని చూసుకుని నేర్చుకోవాలని పదే పదే వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో వైసీపీ నేత చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కూల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడిన ఆయన.. సాధారణంగా చిరంజీవి కొత్త సినిమాలకు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే అభిమానులే కాదు.. ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తారని.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కనిపించని విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ నో అడ్మిషన్స్ బోర్డులు కన్పిస్తున్నాయి అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతున్నారని వ్యాఖ్యానించారు.

    ఇదీ చదవండి: చిరంజీవిని వాడేసుకుంటున్న వైసీపీ.. రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

    అందుకు కారణం కూడా లేకపోలేదన్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేకలను తమ ప్రభుత్వం మార్చేసింది అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు భిన్నంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆట స్థలం ఉంది. ఎస్టీ పాఠశాలల్లో టేబుల్‌లు, టీవీ సెట్‌లతో అద్భుతంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, తరువాత పాఠశాలల దుస్థితిని తనిఖీ చేయాలన్నారు. తాను ప్రతిపక్ష పార్టీలను కూడా అభ్యర్థిస్తున్నాను అన్నారు.

    ఇదీ చదవండి: : ఏపీపై కమలం ఫోకస్.. వైసీపీ, టీడీపీ నుంచి త్వరలోనే చేరికలుంటాయన్న ఎంపీ

    ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాల గురించి బడ్జెట్ లో ప్రస్తావించారు. విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు. విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. నాడు నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్యా, ఆరోగ్యాన్నిఅందించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకు వచ్చాం అన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Megastar Chiranjeevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు