హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP on Chandrababu: పబ్లిసిటీ కోసం ప్రమాదకర ఫీట్లా..? వరద పేరుతో బురద రాజకీయంపై సజ్జల సెటైర్లు

YCP on Chandrababu: పబ్లిసిటీ కోసం ప్రమాదకర ఫీట్లా..? వరద పేరుతో బురద రాజకీయంపై సజ్జల సెటైర్లు

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

YCP on Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వరదల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఏపీలో వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. ఆయన పర్యటన అంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...

YCP on Chandrababu: మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వానలు.. వరదలు ముంచెత్తాయి. ఆ వరద ప్రభావం నుంచి ఏపీ ఇంకా తేరుకోలేదు.. కానీ వరద చుట్టూ రాజకీయం ముసురుకుంది. తాజాగా ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యటించారు. వరదల్లో ఇబ్బంది పడుతున్న జనం దగ్గరకు స్వయంగా వెళ్తూ.. వారి కష్టాలపై ఆరా తీస్తున్నారు. వరద బాధితులకు టీడీపీ (TDP) అండగా ఉంటుందనే ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు వరదలో ఇబ్బంది పడుతుంటే.. గాల్లో తిరిగే సీఎంకు ఏం తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు.. అయితే తాజాగా చంద్రబాబు నాయుడి విమర్శలపై ఘాటుగా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy). అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి అన్నారు సజ్జల. తమకు సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని.. అయితే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. బాబు అబద్దాలు వల్లెవేస్తున్నారని జనానికి కూడా అర్థమయ్యిందని వివరించారు. పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని సజ్జల విమర్శించారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. జనం కష్టంలో ఉంటే సాయం చేయాల్సింది పోయి.. విమర్శలు చేయడానికి సమయం కేటాయించడం బాగోలేదన్నారు.

అసలు చంద్రబాబు నాయుడు వెళ్లింది దేనికి అని నిలదీశారు. వరద పర్యటనకా? ప్రచారానికా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు అంతా బాగానే ఉన్నామని చెబుతున్నా..? పచ్చి అబద్ధాలు చెప్పడం చూస్తుంటే ఎవరైనా నవ్వుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. అసలు చంద్రబాబు నాయుడు జీవితమే ఓ అబద్ధం అయిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు టీడీపీ హయాంలో విపత్తులు వస్తే ఒక్కసారైనా తక్షణ సాయంగా పైసా ఇచ్చారా అని సజ్జల ప్రశ్నించారు. చీపురు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు.

కేవలం పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆరోపించారు సజ్జల. అధికారంలో ఉండగా అలా ప్రవర్తించారని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తీరు మారలేదని మండిపడ్డారు. ఆయన చేసే అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని విమర్శలు చేశారు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా కామెంట్స్ చేస్తున్నారని గుర్తుచేశారు. భుత్వం చేస్తోన్న పనులను జనం గుర్తిస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి : ఈ ఎమ్మెల్యేను గుర్తు పట్టారా..? అధికార పార్టీ నేత అయినా.. వ్యవసాయంతో బిజీ బిజీ

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, ఆయన చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సెటైర్లు వేశారు. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ.? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో అంత డేంజరస్ ఫీట్ అవసరమా? ఎల్లో మీడియా లైవ్ కవరేజి కోసమే కదా అంటూ విజయసాయి సెటైర్లు వేశారు.


ప్రస్తుతం గోదావరి వరద గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ కీలక సూచన కూడా చేశారు. ప్రచారం కోసం వరద ప్రాంతాలకు వెళ్తున్న చంద్రబాబు.. అక్కడ కాకుండా శ్రీలంకకు వెళ్తే ఎక్కువ ప్రచారం వస్తుందని సలహా ఇచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy, Vijayasai reddy