M BalaKrishna, Hyderabad, News18. MP Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ (CM Jagan Mohan Reddy) రెడ్డి.. ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరికి ప్రాదాన్యత పెరుగుతుందో.. తగ్గుతుందో తెలియడం లేదు. ఈ రోజు ప్రభుత్వంలోనూ.. పార్టీలో చక్రం తిప్పే వాళ్లు సడెన్ గా రేసులో వెనుకబడతారు..? అప్పటి వరకు పార్టీకి దూరం పెట్టారు అనుకున్నవారు సడెన్ గా తెరపైకి వస్తారు..? సన్నిహితులు దూరం అవుతారు.. దూరంగా ఉండే నేతలు అధినేతకు దగ్గర అవుతారు. తాజాగా పార్టీ నేతలకు అప్పగించిన బాధ్యతలు చూస్తే ఇలాంటి అనుమానాలు రావడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో అన్ని తానై పార్టీలో చేరికలు, అభ్యర్ధల ఎంపికల్లో ముందున్నవిజయసాయి సాయిరెడ్డి (Vijayasai Reddy) జగన్ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత ఏడాదిలోనే వైజాగ్ (Vizag) కు పరిమితమైయ్యారు. ఆయనకి జగన్ కి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరుగా జరిగింది. అధినేత తీరు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉందనడంలో సందేహాం లేదు. అయితే సాయిరెడ్డి తరువాత స్ర్కిన్ పైకి వచ్చిన సజ్జల నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మాటలను తన మాటాల్లో వినిపించారు.
రాష్ట్రంలో ఇటు పార్టీ పరంగా అయినా.. అటు ప్రభుత్వ పరంగా అయినా..? ఏ చిన్న సమస్య వచ్చిన సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నప్పటికి సజ్జల మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వడం లేదా ప్రతిపక్ష పార్టీల తీరుపై విమర్శలు చేయడం వంటివి చేశారు. చాలా కీలక అంశాలైన వివేకానందరెడ్డి హత్య వ్యవహారం, ఉద్యోగుల సమ్మె, సినిమా టిక్కెట్లు ఇలా ఒక్కటేమిటి ఏపీలో నెలకున్న సమస్యలన్నిపై సజ్జల స్పందించేవారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలన్న ముందు సజ్జలకు విషయం చెబితే తరువాత ముఖ్యమంత్రిని కలిసే ఏర్పాట్లు జరిగేవి.. అది సజ్జలకు మొన్నటి వరకు పార్టీలో ఉండే ప్రధాన్యత..
ఇదీ చదవండి : దేశ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్రం
సజ్జలకు పార్టీలో ప్రధాన్యత పెరుగుతున్న కొద్దీ.. విజయసాయి రెడ్డి అధినేతకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఇటు విశాఖ, అటు ఢిల్లీకి మాత్రమే ఆయన రాజకీయాలు పరిమితం అయ్యాయి. ఇప్పుడు విజయసారెడ్డి స్థానంలో విశాఖకు విడదల రజినిని ఇన్ చార్జ్ మంత్రి గా వేయటం వరకు జగన్ అండ్ సాయిరెడ్డి మద్య గ్యాప్ అని అందరు చర్చించుకున్నారు. తాజాగా సాయిరెడ్డికి మళ్లీ జగన్ మెహాన్ రెడ్డి ప్రాదాన్యత ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి జిల్లా ఇన్ చార్జ్ మంత్రులతో ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సమావేశం తరువాత సాయిరెడ్డి రెడ్డి తో భేటీ అయినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు సంబంధించి అన్ని బాధ్యతలు మళ్లీ సాయిరెడ్డిని చూసుకోమని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎలాఅయితే పీకే టీం తో కో ఆర్డినేట్ చేసుకొని పార్టీకి గెలుపు గుర్రాలను గుర్తించారో వచ్చే ఎన్నికలకు కూడా సాయిరెడ్డి అలానే పని చేయాలని జగన్ సాయిరెడ్డికి సూచించారు.
ఇదీ చదవండి :ఏపీ సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వర రావు.. ఏం చెప్పారంటే..?
మొత్తం ఎన్నికల వ్యూహాల దగ్గర నుంచి పార్టీలో చేరికలు వరకు అన్ని వ్యవహారాలు సాయిరెడ్డి చూసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది పాటు జగన్ అండ్ కో టీమ్ కు దూరంగా వైజాగ్ కు పరిమితమైన సాయిరెడ్డికి మళ్లీ జగన్ వద్ద ప్రాదాన్యత లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తోన్నారు సాయిరెడ్డి వర్గీయులు. తాజాగా జరిగిన ఈ సంఘటనలతో జగన్ ఎప్పుడు ఎవరికి ప్రాదాన్యత ఇస్తారో ఉన్న ప్రాదాన్యత తీస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు పార్టీలో కొంత మంది నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Sajjala ramakrishna reddy, Vijayasai reddy