హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan vs YCP: పవన్ వ్యాఖ్యలకు మంత్రుల స్ట్రాంగ్ కౌంటర్.. నిజం ఒప్పుకున్నారంటూ సెటైర్లు

Pawan vs YCP: పవన్ వ్యాఖ్యలకు మంత్రుల స్ట్రాంగ్ కౌంటర్.. నిజం ఒప్పుకున్నారంటూ సెటైర్లు

పవన్ వర్సెస్ అమర్ నాథ్

పవన్ వర్సెస్ అమర్ నాథ్

Pawan vs YCP: పవన్ వర్సెస్ వైసీపీ ఫైట్ మళ్లీ పీక్ కు చేరింది. యువశక్తి పేరుతో నిర్వహించిన సభలో మంత్రులు ఒక్కక్కరి పేరు ప్రస్తావిస్తూ.. వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయా మంత్రులు ఇప్పుడు.. పవన్ పై అటాక్ కు దిగారు..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Pawan vs YCP:  జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వర్సెస్ వైసీపీ (YCP) ఫైట్ పీక్ కు చేరింది.. శ్రీకాకుళం జిల్లా (Srikakulam) లో నిర్వహించిన యువశక్తి సభలో మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్.. పేరు పేరునా అందరి పైనా విమర్శలు చేశారు.. అయితే పవన్ కు అదే స్థాయిలో రాష్ట్ర మంత్రులు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు మంత్రి రోజా (Minister Roja) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ తో తిట్టించుకోవాలా అని మండిపడ్డారు. అయినా ప్రజల కోసం తప్పట్లేదంటూ ట్వీట్‌ చేశారు. ప్యాకేజ్ స్టార్ అంటూ హాష్ ట్యాగ్ చేశారు.

మరోవైపు, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పవన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నారు. క్యా బాత్‌ హై అని పవన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. మొత్తానికి పవన్ నిజం ఒప్పుకున్నారని.. ఆయన ఓడిపోతున్నారని ముందే తెలుసుకున్నారు అంటూ మంత్రి అమర్ నాథ్ సెటైర్లు వేశారు.

ఇక పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.. తాను సంబరాల రాంబాబునైతే.. పవన్ కల్యాణాల కళ్యాణ్ అంటూ సెటైర్లు వేశారు.. మొత్తానికి పవన్ ఎక్కువగా తన గురించి టెన్షన్ పడుతున్నారని.. అంబటి అన్నారు.. ప్యాకేజ్ స్టార్ కాకుంటే ఇంతలా పవన్ ఎందుకు ఇంతలా ఎందుకు ఊగిపోతున్నారంటూ అంబటి ప్రశ్నలు వేశారు.

ఇదీ చదవండి : బాలయ్య సినిమాకు వైసీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ.. వసంత కథ వేరే లెవెల్ ఉందిగా..?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. సభలో పవన్‌ తన సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందని మండిపడ్డారు. ఏరా, ఒరే అనడమేనా సంస్కారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు స్వభావం గల వ్యక్తి పవన్‌. పవన్‌.. ఇదేనా నీ వ్యక్తిత్వం? అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి : కోళ్లకు మిలటరీ ట్రైనింగ్.. ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా?

మంత్రి రోజాను డైమాండ్‌ రాణి అంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. రోజా సినిమాల్లో నటించిందని.. దిగజారి మాట్లాడని.. ఆయన ఇంట్లో ఆడవాళ్లు.. సినిమాల్లో నటించడం లేదా అని ప్రశ్నించారు. సభకువచ్చిన జనాన్ని పవన్‌ కల్యాణ్‌ నమ్మను అని చెప్పడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

ఇక పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అసలైన మూడు ముక్కలాట పవన్‌ కల్యాణ్‌కే వర్తిస్తుందన్నారు.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు స్క్రిప్ట్ చదివినట్టు ఉందన్న ఆయన.. ప్రజా రాజ్యం మూసేసిన రోజున, జనసేన పెట్టిన సమయంలో మాట్లాడిన మాటలు పవన్ కి గుర్తులేవా? అని ప్రశ్నించారు.. 2019 అప్పటినుంచి లెక్కలు చెబుతున్నారు .. రాష్ట్రం విడిపోయినప్పటి గురించి మాట్లాడటం లేదు ఎందుకు అని నిలదీశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan, Ycp

ఉత్తమ కథలు