హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర.. వారికి తెలియకుండా స్కాం జరగదన్న సజ్జల

Sajjala: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర.. వారికి తెలియకుండా స్కాం జరగదన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు (ఫైల్)

Sajjala: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఆరోపణలు కుదిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల.. ఇంత పెద్ద స్కాం చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు తెలియకుండా జరగదు అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Sajjala: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development) ఆరోపణలు రచ్చ రచ్చ అవుతున్నాయి. ఇదీ చాలా పెద్ద స్కాం అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. అప్పటి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ల పాత్ర ఉండి ఉంటుందని ఏపీ ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కాం అని అభిప్రాయపడ్డారు. ఈ స్కామ్ లో రాజకీయ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.

అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు.. మంత్రిగా నారా లోకేష్ కు ఏమీ తెలియకుండా ఇంత పెద్ద స్కాం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాల్లో అవకతవకలు జరిగాయని.. అవన్నీ బయటకు వస్తే వారి బండారం బయటపడుతుందనే భయంతోనే.. రోజుకో కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపుతున్నారని సజ్జల ఆరోపించారు.

అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాయల సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారని.. సీమకు ఇప్పటి వరకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. ఉంటే ధైర్యంగా చెప్పాలని సజ్జల సవాల్ విసిరారు. ఇప్పుడు తాము రాయలసీమను అభివృద్ధి చేయాలని చూస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని... కోర్టులో కేసులు వేసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి : శ్రీవారి సన్నిధిలో భారత రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ముకి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు

ఇక పోలవరం జాప్యానికి చంద్రబాబు ఏ కారణమన్నారు. పోలవరం కనుగొన్నది తానేనన్నట్లు మాట్లాడుతూ చంద్రబాబు పగటి కలల్లో మునిగితేలుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. పోలవరం పనుల్లో జాప్యానికి కారణం చంద్రబాబు నిర్వాకమేనని, ఆయన చెప్పే మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని సజ్జల వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింత గట్టిగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి : బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డికి అస్వస్థత.. రాయలసీమ గర్జనలో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయిన యువనేత

తమ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కుప్పం అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని సజ్జల చెప్పారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని జగన్ ను కొనియాడారు. జగన్ చేస్తున్న మంచి పనులపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై సజ్జల సంచలన ఆరోపణలు చేశారు. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయమని సజ్జల తేల్చిచెప్పారు. జగన్ పాలనలో మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు