హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RRR: మీసం మెలేస్తారు... కాలు ఎత్తి చూపిస్తారు... రఘురామ అరెస్ట్ రాత్రికి రాత్రి జరగలేదు

RRR: మీసం మెలేస్తారు... కాలు ఎత్తి చూపిస్తారు... రఘురామ అరెస్ట్ రాత్రికి రాత్రి జరగలేదు

ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రఘురామకు అనుకూలంగా వస్తుందా? ఏపీ పోలీసులకు అనుకూలంగా వస్తుందా? ఒక వేళ ఎంపీకి అనుకూలంగా రిపోర్ట్ వస్తే.. పోలీసులు, ఇటు ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలసి వస్తుంది.

ఇంకా చదవండి ...

  ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన మెడికల్ రిపోర్ట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏం అవ్వలేదని స్పష్లం చేశారు. కానీ రఘురామ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ అవి తాజాగా తగిలిన దెబ్బలే అని తేలితే.. ఏపీలో సీఐడీ పోలీసుల వ్యవహారాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇటు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఊహించడం కష్టమే. అలా కాకుంబా అవి తాజాగా కొట్టిన దెబ్బలు కాదని తెలిస్తే.. అసత్యాలు చెప్పినందుకు ఎంపీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

  మెడికల్ రిపోర్టు తమకే అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం.. తనకే రిపోర్టు అనుకూలంగా వస్తుందని ఎంపీ వర్గీయులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలోనూ ఎంపీ చాలా ధీమాగా కనిపించారు. చాలా వరకు మీసం తిప్పుతూనే కనిపించారు. అలాగే తన కాలును ఎత్తి చూపిస్తూ దెబ్బల సంగతి తేలుతుంది అంటూ చూపించారు.. దీంతో అసలు రిపోర్టు ఎలా ఉంటుంది అన్నది క్షణ క్షణం ఉత్కంఠ పెంచుతోంది.

  మరోవైపు ఎంపీ తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ రఘురామ అరెస్టు విష‌యంలో ఎక్కడైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమో లేక, మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడమో చేయ‌లేద‌ని అన్నారు. సీఎంకు ఆపాదించడం, బురద చల్లాలని చూడడం దుర్మార్గమ‌ని.. టీడీపీకి మొదటి నుంచి ఇది అలవాటే అంటూ స‌జ్జ‌ల ఫైర్ అయ్యారు. రఘురామ ఓ పక్క మీసం మెలేస్తారు.. మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు. మళ్లీ కారు దిగిన తర్వాత నడవలేనట్టుగా భుజంపై ఆసరాతో వెళతారు. ఎందుకు అలా చేస్తున్నారో అర్ధం చేసుకోవాల‌ని అన్నారు.

  రాఘురామ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వాన్ని నిదించడం చూస్తే.. టీడీపీ కుట్ర పూరితంగా చేస్తుంద‌నే అనుమానం క‌లుగుతుంద‌ని స‌జ్జ‌ల అన్నారు. కోర్టుకు హాజరైన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారని, భోజనం కూడా తెచ్చారని వివరించారు. హైకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన వెంటనే డ్రామా మొదలైందని అన్నారు. రఘురామ వ్యాఖ్యలు సీఎంపైనే కాకుండా కులాలు, మతాలు, ప్రభుత్వ పథకాలపైనా వ్యాఖ్యలు చేశాడని వివరించారు. మానసిక స్థితి సరిగాలేకనో, ఆక్రోశం భరించలేకనో అన్నాడంటే సరిపెట్టుకోవచ్చు... కానీ రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపైనా సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామ కేసులో రాజద్రోహం అంటే ఏంటో తనకు తెలియదని, అసలా పదమే చంద్రబాబు అంటున్నారని తెలిపారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, MP raghurama krishnam raju, Sajjala ramakrishna reddy, Supreme Court

  ఉత్తమ కథలు