Sajjala on ap new cabinet: సీఎం జగన్ కేబినెట్ ఎంపిక ఏ ప్రతిపాదికన జరిగింది..? ఏఏ వర్గాలకు ఎలాంటి అవకాశం ఇచ్చారు.. తొలి కేబినెట్ కు రెండో కేబినెట్ కు తేడా ఏంటి..? పదవులు దక్కని వారు పార్టీ వీడే అవకాశం ఉందా.. ఈ విషయాలు అన్నింటికీ సజ్జల క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..?
Sajjala Rama Krishna Reddy on New Cabinet selection: జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy).. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఎదో ఎన్నికల కోసం హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీకి తోడు.. బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతోనే కేబినెట్ కూర్పు చేశారని వివరణ ఇచ్చారు. జగన్ తన తొలి కేబినెట్ సామాజిక విప్లవానికి నాంది పలికింది అన్నారు.
ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహా విప్లవాన్ని తీసుకొచ్చారు అన్నారు. గతంలో ఎప్పుడూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎవరూ పెద్ద పీట వేయలేదని.. కానీ 2109 జూన్ లో జగన్ ఏర్పాటు చేసిన తొలి కేబినెట్ లో
25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఇచ్చి..
11 మంది ఓసీలకు ఇచ్చామన్నారు. అదే చంద్రబాబు 2014లో ఏర్పాటు చేసిన కేబినెట్ ను పరిశీలిస్తే.. 25కి గాను.. 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే మంత్రిపదవులు ఇచ్చారు.. అలాగే
ఎస్సీలకు ఇచ్చింది కేవలం మూడు మాత్రమే అని గుర్తు చేశారు.
చంద్రబాబు తొలి కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు అసలు చోటే ఇవ్వలేన్నారు. ఇక రెండో సారి విస్తరించిన తరువాత కూడా.. ఎస్టీకి 4 నెలలముందు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇక జగన్ సీఎం అయ్యాక తొలి కేబినెట్ లోనే 5 మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చామని.. అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించామన్నారు.
తాజా కేబినెట్ లోనూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 17 మందికి చోటిచ్చామని వివరించారు. మొత్తంగా 25 మందిలో బీసీలు ప్లస్ మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 అంటే మంత్రిమండలిలో 68 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. తొలి కేబినెట్ లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. ఆ సంఖ్యను ఇప్పుడు నాలుగుకి పెంచామన్నారు. అయితే బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, కమ్మ కులాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించలేదు అన్న ఆరోపణలను సజ్జల ఖండించారు. కేబినెట్ లో అవకాశం కల్పించ లేకపోయినా వారికి లెక్క సరి చేయడానికే..
డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇచ్చామని.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla veerabadhra Swamy)కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చామన్నారు సజ్జల. అలాగే ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవి బ్రాహ్మణుల వర్గానికి చెందిన మల్లాది విష్ణు (Malladi Vishnu)కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే అసెంబ్లీలో చీఫ్ విప్‌గా ప్రసాదరాజుకు (Prasad Raju) అవకాశం ఇస్తామని చెప్పారు.
అలాగే మంత్రి పదవులు దక్కని వారిని బుజ్జగిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన వైసీపీ లో అలాంటి పరిస్థితి లేదన్నారు. నాయకులు ఎవరూ అలగడం లేదన్నారు. కేవలం కొందరు అనుచరులు మాత్రం.. తమ నేతకు పదవి దక్కలేదనే ఆవేదనతో అక్కడక్కడా ఆందోళనలు చేస్తున్నారని.. వారికి ఆయా నేతలే సర్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో పదవుల కోసం పని చేసే వారు ఎవరూ లేరన్నారు. అందరూ జనగ్ పై వంద శాతం నమ్మకంతోనే ఉన్నారని.. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీ విధానం అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ సీరియస్ తీసుకోరు అన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.