హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tarakaratna: తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్..ఏమన్నారో వీడియో చూడండి

Tarakaratna: తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్..ఏమన్నారో వీడియో చూడండి

cbn,tarakaratna,laxmi

cbn,tarakaratna,laxmi

Tarakaratna:నందమూరి తారకరత్న మరణంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. తారకరత్న మరణం బాధకరమని విచారం వ్యక్తం చేసిన ఆమె ..ఇదంతా చంద్రబాబు అవలంభిస్తున్న నీచమైన రాజకీయ విధానమని మండిపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

నందమూరి తారకరత్న(Tarakaratna)మరణంపై వైసీపీ నాయకురాలు, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్‌ పర్సన్ లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi)సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu)ను ఉద్దేశించి ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ముందుగా తారకరత్న మరణం బాధకరమని విచారం వ్యక్తం చేసిన లక్ష్మీపార్వతి ..ఇదంతా చంద్రబాబు అవలంభిస్తున్న నీచమైన రాజకీయ విధానమని మండిపడ్డారు. తన కుమారుడు పాదయాత్ర లోకేష్(Lokesh)పాదయాత్రను ప్రజలు అపశకునంగా భావిస్తారనే ఉద్దేశంతోనే చనిపోయన తారకరత్నను ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచి అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి.

లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్

సినీ నటుడు నందమూరి తారకరత్న మరణవార్త యావత్ సినీ పరిశ్రమను, రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివాదరహితుడిగా ఉన్న తారకరత్న 23 రోజులు చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. తారకరత్న మరణంపై విచారం వ్యక్తం చేశారు వైసీపీ నాయకురాలు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. అయితే తారకరత్న ఎప్పుడో చనిపోతే తమ స్వార్ధ రాజకీయాల కోసం ఆసుపత్రిలో ఉంచి మరణవార్తను ఇన్ని రోజులు దాచిపెట్టారంటూ చంద్రబాబుపై ఘాటు ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి.

చంద్రబాబుపై ఫైర్ ..

తారకరత్నకు హార్ట్ ఎటాక్ వచ్చిన రోజే డాక్టర్లు బ్రతకడం చాలా కష్టమని చెప్పారని..కాని చంద్రబాబు తన కొడుకు లోకేష్ పాదయాత్రను ప్రజలు అపశకునంగా భావిస్తారని ఊహించి చనిపోయిన తారకరత్నను ఆసుపత్రిలో ఉంచారని ఆమె విమర్శలు చేశారు. రెండ్రోజులు నారా లోకేష్ పాదయాత్ర వాయిదా వేసుకొని తారకరత్న మరణవార్తను అప్పుడే ప్రకటించి ఉండాల్సింది అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించడంపై అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Chandrababu: ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నారు.. ఇంతలోనే! తారకరత్న మృతిపై చంద్రబాబు ఆవేదన

ఘాటు విమర్శలు..

చివరగా లక్ష్మీపార్వతి చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానాన్ని అవలంభిస్తున్నారని ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయ కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికే తండ్రి,కొడుకులు ఇద్దరూ అపశకునమనే విషయం ప్రజలందరికి తెలుసని లోకేష్ , చంద్రబాబును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. నారా కుటుంబం నీచమైన రాజకీయాలు చేయడం ఆపేస్తే మా నందమూరి కుటుంబం బాగుపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

First published:

Tags: Chandrababu Naidu, Laxmi's NTR, Taraka Ratna

ఉత్తమ కథలు