Lakshmi Parvathi: దివంగత నేత ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి (Uma Maheswari) మృతిపై అనుమానాలు వీడడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. వైసీపీ నేతలంతా (YCP Leaders) ఇది చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన హత్యే అంటూ ఆరోపిస్తున్నారు. అందుకు ధీటుగానే టీడీపీ నేతలు (TDP Leaders) సమాధానం ఇస్తున్నారు. అయితే తాజాగా సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి (Lakshimi Parvathi) . ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారని, ఆ ఒత్తిడి భరించలేకనే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అందుకే ఆమె సూసైడ్ లెటర్ ను మాయం చేశారంటూ ఆమె ఆరోపించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సైతం అదే వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్ ల కుట్రకు ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ మండిపడ్డారు.. వెంటనే దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఆయన వ్యాఖ్యలకు కొనసాగింపుగా లక్ష్మీ పార్వతి మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా ఒక మిస్టరీలా ఉంది అన్నారు. అసలు ఎన్టీఆర్ కుటుంబంలో వరసగా విషాద ఘటనలు జరుగుతున్నాయని.. హరికృష్ణ మరణాన్నే జీర్ణించుకోలేకపోతుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఇంకా బాధ కలిగిస్తోంది అన్నారు. వాస్తవంగా ఏం జరుగుతోందనేది అర్ధం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. అంతా ఒక మిస్టరీగా కనిపిస్తోందని.. సోషల్ మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయిని.. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉండొచ్చని లక్ష్మీ పార్వతి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మనస్తత్వం, అతడి నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అనుమానం రాక తప్పదన్నారు లక్ష్మీ పార్వతి. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ కుటుంబంలో ఒక శనిలా ప్రవేశించారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చివరికి ఇంటి పెద్దను కూడా ఆ కుటుంబం కోల్పోవడం జరిగిందని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త నందమూరి తారక రామారావు మరణానికి ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. సింహగర్జన సదస్సు నిర్వహించి, చంద్రబాబు చేసిన దగాను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నప్పుడు, అదే జరిగితే, ఎన్టీఆర్ బయటకు వస్తే, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడిన చంద్రబాబు, ఎన్టీఆర్ మరణానికి ఒక రోజు ముందు, అంటే జనవరి 17వ తేదీన ఎన్టీఆర్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోకుండా, స్టే తీసుకొచ్చాడని ఆమె ఆరోపించారు. దీంతో అదే రాత్రి ఎన్టీఆర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆ విధంగా ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడన్నారు.
కానీ ఇప్పుడు కూడా గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్లుగా చంద్రబాబును నమ్ముతోందని.. దీన్ని చూస్తే తనకు చాలా జాలి అనిపిస్తోంది. తనను బూచిగా చూపి, ఎన్టీఆర్ నుంచి పదవిని, పార్టీని లాక్కున్నాడు. దాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నమ్మారని గుర్తు చేశారు.. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో చాలా జరిగాయి. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం. అయన చనిపోవడానికి ముందు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : సముద్ర తీరంలో వింత జీవి.. అది ఎంత డేంజరో తెలుసా?
అలాగే హరికృష్ణ మరణానికి కూడా స్వార్థం కోసం వినియోగించుకున్నారు చంద్రబాబు. ఒక మంత్రి పదవి ఇచ్చి, ఆరు నెలల్లోనే లాగేసుకున్నారన్నారు. దాంతో హరికృష్ణ చాలా నిరాశ, నిస్పృహకు లోనయ్యానే. ఆ ఫ్రస్టేషన్‌లోనే కారు నడిపిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ ఇప్పటికీ చంద్రబాబుతో మాట్లాడరంటూ ఆరోపించారు లక్ష్మీ పార్వతి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Lakshmi Parvathi