హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lakshmi Parvathi: ఆ యువ నాయకుడిని కేంద్రం జైలుకి పంపించడం ఖాయం.. పవన్ కు భారీ నష్టం తప్పదు

Lakshmi Parvathi: ఆ యువ నాయకుడిని కేంద్రం జైలుకి పంపించడం ఖాయం.. పవన్ కు భారీ నష్టం తప్పదు

Lakshmi Parvathi: ఆ యువ నాయకుడిని కేంద్రం జైలుకి పంపించడం ఖాయం.. పవన్ కు భారీ నష్టం తప్పదు

Lakshmi Parvathi: వైసీపీ నేత లక్ష్మీ పార్వతి మరోసారి టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. కేంద్రం తలుచుకుంటే ఆ యువ నాయుకుడు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల తీరును తప్పు పట్టారు. ఎవరికి జీతాలు పడడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Lakshmi Parvathi: వైసీపీ నేత లక్ష్మీ పార్వతి (Laxmi Parvathi) మరోసారి తెలుగు దేశం (Telugu Desam) నేతలపై నిప్పులు చెరిగారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందని ఆమె ఆరోపించారు. ఏపీలోని చిన్న వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తాననడం చూస్తే నవ్వొస్తోంది అన్నారు. ఫైబర్ నెట్ స్కామ్ (Fiber Net Scam) లో భారీగా దోపిడీ జరిగిందని.. ఆ కేసులో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు రావడం ఏంటని ఎద్దేవ చేశారు. అసలు కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయమని.. అది త్వరలోనే జరుగుతుంది అన్నారు. అలాగే మన రాష్ట్రంలో సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్న వారు చాలా మంది ఉన్నారని.. వాళ్ళను చూస్తే వాళ్ళ పుట్టుక సక్రమమైనదేనా అనే అనుమానం కలుగుతోంది అన్నారు.

పేదలకు ఆశ చూపించి.. వంద రూపాయలు చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయక మహిళల ప్రాణాలు తీయడం దారుణమన్నారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా వాళ్ళకు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు.. అన్ స్థాపబుల్ లో హంతకులు ఇద్దరు ఒకరిని ఒకరు సమర్ధించుకున్నట్టు అనిపించింది.

ప్రతిపక్షాలు ప్రజా కంటకంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తెచ్చిందే అమరావతి ఆత్మగౌరవ నినాదం అని విమర్శించారు లక్ష్మీపార్వతి. అలాగే సిపిఐ నారాయణ, రామకృష్ణ లు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయి అని ఆరోపించారు. ఎన్.టి.ఆర్ కు చేసిన మోసం, అన్యాయాలకు క్షోభించి క్షీణించిపోయే రోజులు చంద్రబాబు కు ఎంతో దూరంలో లేవన్నారు. ఇప్పుడు సహవాస దోషంతో పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని.. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు భారీ నష్టం తప్పదన్నారు.

ఇదీ చదవండి : బాలయ్యకు వరుస వార్నింగ్ లు.. ఇటు అక్కినేని హీరోల సెటైర్లు.. అటు కాపు నాడు అల్టిమేటం

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల తీరుపై లక్ష్మీపార్వతి (Lakshmi Parvati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడమేంటని ఆమె ప్రశ్నించారు. సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలని, అవసరమైతే సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని (Jagan)ను కలవాలని లక్ష్మీపార్వతి సూచించారు. గవర్నర్‌ దగ్గరకు వెళ్లడమంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడమే అని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. అసలు ఉద్యోగులకు జీతాలు జగన్ సర్కార్ ఇస్తోందని, ఎవరికి జీతాలు రాలేదో చెప్పాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

ఇదీ చదవండి : బీజేపీలో ముదిరిన ముసలం.. 120 మంది రాజీనామా..? పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

జీవో నెంబర్ 1 పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవో నెం. 1 తీసుకువస్తే స్టేలతో అడ్డు పడుతున్నారు. ఎక్కడా వైఎస్సార్‌సీపీ కోర్టులను విమర్శించదు. కానీ కోర్టులను తప్పు దారి పట్టించడంలో టీడీపీ దిట్ట. ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టీ ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?, హంతకులు ఇద్దరు సాక్ష్యం చెప్పుకున్నట్లు బాలకృష్ణ, చంద్రబాబు మాటలు ఉన్నాయి అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Lakshmi Parvathi

ఉత్తమ కథలు