Ycp leader On Jagan Government: సాధారణంగా అధికార వైసీపీ (YCP) లో అధినేతను విమర్శించే సాహసం ఎవరూ చేయరు.. పార్టీలైన్ దాటి మాట్లాడేవారు చాలా అరుదుగానే కనిపిస్తారు. ఇటీవల పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. జగన్ రెండున్నరేళ్ల పాలనపై సాధారణంగానే కొంత వ్యతిరేకత ఉంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులతో ఆ వ్యతిరేకత కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. నిత్యావసరాల నుంచి అన్ని రేట్లు పెరుగుతుండడంతో.. మధ్య తరగతి నుంచి అక్కడక్కడ వ్యతిరేకత కనిపిస్తోంది. విపక్షాలు, ఒక వర్గం ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం కామన్.. మంచి చేసినా విమర్శలు చేస్తారని అంతా లైట్ తీసుకుంటారు. కానీ అధికారంలో ఉంది. అదే పార్టీపై కొందరు నేతలు విమర్శలు చేస్తుండడం.. వైసీపీలో కలకలం రేపుతోంది. అది కూడా పార్టీ సీనియర్ నేతల నుంచి ఇలాంటి విమర్శలు రావడం ఇప్పుడు రాజకీయాల్లో రచ్చ రచ్చ అవుతున్నాయి.
తాజాగా ఏపీలో సరికొత్త పాలన మొదలైంది. నిన్నటి వరకు 13 జిల్లాలుగా ఉన్నఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) .. ఇప్పుడు 26 జిల్లాలుగా మారింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు (New disrtricts) ఏర్పాటయ్యాయి. కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో ఉన్నాయి. సీఎం జగన్ కారణంగానే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చంద్రబాబు (Chandrababu)కు చేతకానిది.. తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మూడేళ్లలోనే చేసి చూపిస్తాన్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి రాని ఆలోచనలు జగన్ కు వస్తున్నాయని, రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ : జగన్ దారిలో పవన్.. యాత్ర పేరుతో గ్రామాల బాట పట్టే యోచనలో జనసేనాని
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు వేళ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ పాలనపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధిష్టానంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అసహనంగా ఉన్నారు. జిల్లాల ఏర్పాటులో తనకు ఆహ్వానం అందలేదని ఆయన మనస్తాపం చెందారు. జిల్లాల ఏర్పాటులో తనకు కనీసం ఎటువంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి పిలుపు లేదని దాడి వీరభద్రరావు వాపోయారు. టీవీలో సీఎం జగన్ మొహం చూసి ప్రసంగం విని ఆనందించా అని ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు ఆహ్వానం కూడా అందకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాతినిధ్యం కూడా లేదని వాపోయారు. తమను ఎవరు కాలు పెట్టి తోసేసినా పార్టీని గౌరవిస్తా అని దాడి వీరభద్రరావు చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదురైనా జగన్ ఆశయాల కోసం పని చేస్తానని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని దాడి వీరభద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. నిజాయితీ పాలన అందుతుందా? లేదా? నిజమైన పాలన కింది స్థాయి ప్రజలకు చేరుతుందా? లేదా? విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. పోలీసులు, కబ్జాదారులు, తహశీల్దార్ లు కుమ్మక్కైపోయారు. జగన్ ఇదంతా చెక్ చేసుకోవాలి దాడి సూచించారు.
అనకాపల్లి జిల్లా ఏర్పడిననందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే అనకాపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఇటు అధికారుల నుంచి కానీ అటు పార్టీ నుంచి కానీ, ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడం అసంతృప్తిగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, AP News, Cm jagan, Ycp