హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala Ramakrishnareddy: కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు.. అధికారం సాధ్యంకాదని చంద్రబాబుకు తెలిసిపోయిందన్న సజ్జల

Sajjala Ramakrishnareddy: కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు.. అధికారం సాధ్యంకాదని చంద్రబాబుకు తెలిసిపోయిందన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

Sajjala Ramakrishnareddy: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముక్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలకు కూడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

Sajjala Ramakrishnareddy: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు హద్దులు దాటుతున్నాయి. తాజా పరిస్థితి చూస్తుంటే.. ఎన్నికలు జరుగుతున్నాయా అనేలా ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు జనం బాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ఫిక్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో తీవ్ర ఆరోపణలతో.. ప్రత్యర్థి పార్టీల తీరును ప్రజల్లో ఎండగడుతున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై (Chandrababu Naidu) ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇప్పటికే ప్రజానాడి ఏంటి అన్నది వారికి తెలిసందని.. ఇక ఇప్పట్లో అధికారంలోకి రావడం అసాధ్యమన్న విషయం వారికి అర్థమైంది అన్నారు. ఆ విషయం తెలియడంతోనే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలోని ప్రతిపక్షాలు విమర్శలు చేయాలే గానీ.. అబద్ధాలు ప్రచారం చేయకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన మూడేళ్ల అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసుకున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. అందుకే అసత్య ఆరోపణలకు తెరలేపారన్నారు. మద్యంలో విషం ఉందని దుష్ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితి ఏపీలో లేదన్నారు. ప్రజలంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని.. అందుకే విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అది విఫలమయత్నమే అన్నారు. పరిపాలనా వ్యవస్థపై చంద్రబాబు ప్రజలకు భయాందోళనలు కలిగిస్తురాన్నారని. మూడు రాజధానుల నిర్ణయం ప్రజల సంకల్పంతో తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక అమ్మఒడి (Ammavodi) పథకంలో లెక్కల్లో తేడా వచ్చిన 50వేల తల్లుల ఖాతాలు పెద్ద లెక్క కాదన్నారు. పాఠశాలల్లో హాజరుశాతం పెరిగేందుకు అటెండెన్స్ ను అర్హతగా పెట్టినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఆ నియోజకవర్గంలో వైసీపీ బలం పెరిగిందా? టీడీపీ వర్గపోరే అధికార పార్టీకి ప్లస్ అవుతోందా?

విపక్షాల విమర్శలతో పని లేకుండా ప్రభుత్వం సంక్షేమానికే పెద్ద పీట వేస్తోంది అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గతేడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందన్నారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ సంవత్సరం జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్‌ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలించినట్టు వివరించారు. ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్‌ ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy

ఉత్తమ కథలు