Home /News /andhra-pradesh /

AP POLITICS YCP INTERNAL POLITICS IN RAJJOLE MLA RAPAKA VARA PRASAD VS BONTHU RAJESWARA RAO WHO WILL GET NEXT CHANCE NGS

YCP Clashes: అధికార వైసీపీలో ఆగని రాజకీయ రచ్చ.. రాజోలులో బొంతు వర్సెస్ రాపాకలో నెగ్గేదెవరు? అధిష్టానం ఓటెవరికి?

రాజోలులో రాపాక వర్సెస్ బొంతు

రాజోలులో రాపాక వర్సెస్ బొంతు

YCP Clashes: అధికార వైసీపీలో అసమ్మతి సెగలు పూర్తిగా చల్లారడం లేదు.. రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి. తాజాగా రాజోలులో రచ్చకు ఇప్పట్లో ఆగేలా లేదు. మరోవైపు రాపాక-బొంతు రాజేశ్వరరావు లల్లో ఎవరివైపు నిలబడాలో తేల్చుకోలేక కేడర్ ఇబ్బంది పడుతున్నారు. అధిష్టానం వరకు విషయం చెరినా.. ఇప్పటికు ఆ పంచాయితీని చల్లార్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు..

ఇంకా చదవండి ...
  YCP Clashes: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YCP)లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు.. రోజుకో చోట పురివిప్పుతోంది. తాజాగా కోనసీమ జిల్లా రాజోలు (Rajole) వైసీపీలో మొదలైన రచ్చకు బ్రేకులు పడడం లేదు. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు (Bonthu Rajeswara Rao) పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు.  తనను కాదని.. తనపై గెలిచిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasada Rao) కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో బొంతు అసమ్మతికి కారణం.. అందుకే నేరుగా రాపాకపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ (YCP Pleenaray) సమావేశానికి ఆహ్వానించారు.  ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రాజీనామా సమర్పించిన బొంతు ప్లీనరీకి వెళ్ళొద్దని తన అనుచరులకు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు రాజోలు వైసీపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు.. జనసేన తరపున గెలిచి.. జగన్ కు జై కొట్టినప్పటి నుంచే.. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఆ విషయం పార్టీ పెద్దలకు తెలిసినా.. ఎలాంటి రాజీ ప్రయత్నాలు చేయకపోవడంతో కేడర్ గందరగోళంలో పడింది.

  బొంతు రాజేశ్వరరావు 2014, 2019లో రాజోలు వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. జనసేన అభ్యర్ధి రాపాకపై సుమారు 700 ఓట్ల తేడాతోనే బొంతు ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితం వచ్చిన కొద్దిరోజుల్లోనే రాపాక జనసేన నుంచి వైసీపీకి.. అధినేత జగన్ కు జై కొట్టారు.. పవన్ కళ్యాణ్ కు హ్యాండిచ్చారు. ఆ తర్వాత బొంతు రాజేశ్వరరావును వైసీపీ కో ఆర్డినేటర్, నియోజకవర్గ ఇంఛార్జ్ పదవుల నుండి అధిష్టానం తొలగించి, రాజోలు వైసీపీ కో ఆర్డినేటర్‌గా పెద్దపాటి అమ్మాజీకి బాధ్యతలు అప్పగించింది.  అప్పటి నుంచి బొంతులో అసమ్మతి మొదలైంది. ఆ కారణంతోనే అమ్మాజీకి బొంతు సహకరించలేదని వైసీపీ కార్యకర్తలు చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అధిష్ఠానం రాజోలు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించింది. రాపాకకు బాధ్యతలు అప్పగించడంతో బొంతు మరింత మానసిక ఒత్తిడికి గురయ్యారు. అందుకే ఇలా బహిరంగంగానే ఆయన తన అసంతృప్తిని తెలియజేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ అనుచరల దాడి.. ఐదుగురిపై కేసు నమోదు

  రాజేశ్వరరావుది తొలి నుంచి రాజకీయ నేపథ్యం కాదు.. ఇరిగేషన్‌లో ఇంజినీర్‌ ఇన్ ఛీఫ్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అనూహ్యంగా వరుస పరాజయాలతో పార్టీలో ఇరకాటంలో పడ్డారు బొంతు రాజేశ్వర్రావు.. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజోలు వైసీపీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఈ సమయంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న బొంతు రాజేశ్వర్రావు, రాజీనామా పత్రాన్ని అధిష్ఠానానికి పంపారు. అయితే ఆ లేఖ పంపి రెండు వారాలు అవుతున్నా..? అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజోలు నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా లేదా మరో పార్టీలో చేరతారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అనే అంశం చర్చనీయాంశమైంది..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Rapaka varaprasad, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు