నెల్లూరు (Nellore) వైసీపీ (YCP) రాజకీయాల్లో హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. బల ప్రదర్శన కాదంటూనే ఇద్దరూ.. ఎవరి బలాన్ని వారు ప్రదర్శించారు. ఆదివారం జరిగిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) సభ చూసినా.. ఆయన మాటలు విన్నా.. వైసీపీలో వర్గ పోరు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. తనకు ఎవరూ పోటీ కాదని.. తనకు తానే పోటీ అన్నారు అనిల్.. అంతే కాదు తన సభలో ఎక్కడా ప్రస్తుత మంత్రి ఫోటో కనిపించలేదు. కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు. అటు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (kakani Govardhan Reddy) సైతం.. అనిల్ కు వ్యతిరేకంగా ఉన్న నేతలపై పొగడ్తలు కురిపించారు. తాను మంత్రి అవ్వడానికి కారణం కూడా వారే అంటూ పొగడ్తలు కురిపించారు. అలాగే అనిల్ వ్యతిరేక వర్గాలనకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్న సంకేతాలు ఇచ్చారు..
అయితే ఇద్దరి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. సర్దుకుపోండి అంటూ చెప్పినా.. ఇద్దరు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నట్టే కనిపిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నియోజకవర్గమైన సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నియోజకవర్గం గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ కాన్వాయ్ తో వెళ్లారు. సర్వేపల్లిలో అనిల్ అనుచరులు బాణా సంచా కాల్చి నానా హడావిడి చేశారు. కార్యక్రమం తరువాత అనిల్ కుమార్ నెల్లూరుకు వెళ్లారు.
ఇదే సమయంలో కాకాణికి స్వాగతం పలుకుతూ నెల్లూరు సిటీ పరిధిలో వేసిన ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కాకాణి తాజాగా తన స్వగ్రామమైన తోడేరులో పర్యటిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ప్రత్యర్థిపై పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో అని స్థానిక కేడర్ ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఇద్దరి నేతల తీరుపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పెద్దగా అంచనాలు లేనప్పటికీ.. నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అదే జోరు వచ్చేే ఎన్నిల్లో కంటిన్యూ చేయాలని సీఎం జగన్ భావిస్తుంటే.. ఈ గ్రూపు తగాదాలు పరిస్థితిని తలకిందులు చేసే ప్రమాదం ఉందని అధిష్టాం ఆందోళన చెందుతోంది. అందుకే త్వరలోనే ఆ వివాదాకలు ఎండ్ కార్డు వేయడానికి మాజీ మంత్రికి జిల్లా బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే బాలినేని పిలిచి.. నెల్లూరు బాధ్యతలు సీఎం అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP cabinet, AP News, AP Politics