హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు.. కోటంరెడ్డిన కలిసిన మాజీ మంత్రి అనిల్.. మ్యాటర్ అదేనా..?

YCP Politics: ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు.. కోటంరెడ్డిన కలిసిన మాజీ మంత్రి అనిల్.. మ్యాటర్ అదేనా..?

మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

మంత్రి అనిల్ కుమార్ (ఫైల్)

YCP Politics: సీఎం జగన్ కొత్త కేబినెట్ కూర్పు రచ్చ ఇంకా ఆగడం లేదు. అసమ్మత నేతలు అంతా.. ఒక్కొక్కరుగా సీఎం జగన్ ను కలిసి.. తరువాత తమకు ఎలాంటి బాధ లేదని చెప్పడంతో.. వైసీపీ లో రాజకీయ తుఫాను చల్లారిందని అంతా భావించారు. కానీ తాజాగా ఆ ఆసక్తి కర పరిణామం జరిగింది. తాజా మాజీ మంత్రి అనిల్.. అధిష్టానంపై అలిగిన మరో కీలక నేతను కలవడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇంకా చదవండి ...

YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) ఒకటి అనుకుంటే.. ఇప్పుడు మరొకటి జరుగుతోందా..? ముఖ్యంగా కేబినెట్ విస్తరణ (Cabinet Reshuffle) తరువాత ఎలాంటి సమస్య ఉండదని భావించారు.. అందరికీ చెప్పి చేయడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నారు. మంత్రులు అంతా ఇష్టంతోనే మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వారిని తప్పిస్తున్నందుకు సీఎం కాస్త ఆవేదకు గురైనా.. మంత్రులే తామంతా ఇష్టంతోనే రాజీనామా చేస్తున్నామని.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అంత వరకు సీఎం జగన్ ఊహించిన విధంగా సవ్యంగానే జరిగింది. కానీ రాజకీయ, సామాజిక కారణాలతో చివరి నిమిషంలో లెక్కలు మార్చాల్సి వచ్చింది. ఇద్దరు పాత మంత్రులనే కొనసాగిస్తారు అనుకుంటే.. ఆ లెక్క 11కు పెరిగింది. దీంతో మాజీలు అయిన మంత్రుల్లో అసమ్మతి మొదలైంది. మిగిలిన పదకొండు మంది ఎందులో ఎక్కువ.. తాము ఎందులో తక్కువ అని నిరసనలు మొదలయ్యాయి.  మంత్రి పదవి ఆశించి.. రాని వారు సైతం

బహిరంగంగానే నిరసన తెలిపారు.. విషయం సీఎం వరకు వెళ్లడంతో.. ఆయనే స్వయంగా ఆయా నేతలతో మాట్లాడారు. ఆ తరువాత ఆ

నేతలంతా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..  అధినేత నిర్ణయాన్ని   గౌరవిస్తున్నామంటూ ప్రకటనలు చేయడంతో వివాదం

సద్దుమణగినట్టే కనిపించింది. ఇలాంటి సమయంలో నెల్లూరు (Nellore)లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఏపీలో క్లీన్ స్వీప్ సీట్లు సాధించిపెట్టిన జిల్లాల్లో నెల్లూరు ఒకటి.. టీడీపీ (TDP)కి బలమైన కేడర్ ఉన్నా.. పదికి పది సీట్లు వైసీపీ (YCP) సొంతం చేసుకుంది. దీంతో పార్టీ మరింత పటిష్టం అవుతుంది అనుకుంటే.. పరిస్థితి తారుమారయ్యే హెచ్చరికలు అందుతున్నాయి. వైసీపీలో వర్గ పోరు ఏ స్థాయికి వెళ్తుందో అని స్థానిక కేడర్ భయపడుతున్నారు. తాజా పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. సీఎం జగన్ రెండో కేబినెట్

లో జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కానీ ఆయన పేరు చెబితే చాలు.. స్తానిక నేతలు

మండిపడుతున్నారు. అలా అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలను ఇప్పుడు ఏకం చేస్తున్నది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇదీ చదవండి: ఆ పదవులు రద్దు.. జిల్లా బాధ్యతల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం.. టార్గెట్ 2024 దిశగా అడుగులు

రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఉండే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్నే సాధించింది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు మరో బీసీ మంత్రికి కూడా జగన్ తన తొలి కేబినెట్లో స్ధానం కల్పించారు. మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) రూపంలో ఇద్దరు మంత్రులు జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. అందులో మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) సౌమ్యుడిగా పేరుతెచ్చుకుని

కేబినెట్ ప్రక్షాళనలోపే హఠాన్మరణం చెందారు. మరో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం మొదటి నుంచి ఇక్కడి రెడ్డి

నేతలకు దూరంగా ఉంటూనే ఉన్నారు.

ఇదీ చదవండి: r: మంత్రి అనుచరుల అత్యుత్సాహం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. కరెన్సీ కట్టలు.. బైక్ విన్యాసాలతో హల్ చల్

చాలాకాలం నుంచి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) వర్సెస్ అనిల్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ తన తొలి కేబినెట్లో స్ధానం కల్పించారు. దీంతో జిల్లాలో రెడ్ల నుంచి ఆయనకు సహకారం లభించలేదన్నది ఆయన వాదన.. ఇటీవల ఆయన స్వయంగా ఆ వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎంత సపోర్ట్ చేశారో.. ఇప్పుడు డబుల్ సపోర్ట్ చేస్తాను అంటూ సెటైర్ వేశారు అంటే.. ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  వీరి పోరు అంతర్గంతగానే సాగింది. అనిల్

కు వ్యతిరేకంగా కాకాణి వ్యూహాత్మకంగా జిల్లా నేతల్ని ఏకం చేశారు. చివరికి అనిల్ మంత్రి పదవి కోల్పోయారు. కాకాణి మంత్రి అయ్యారు.

ఇదీ చదవండి: మంత్రి అనుచరుల అత్యుత్సాహం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. కరెన్సీ కట్టలు.. బైక్ విన్యాసాలతో హల్ చల్

ప్రస్తుతం కాకాని మంత్రి అవ్వగా.. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ ను కొనసాగించలేదు. దీంతో అప్పటి వరకూ అనిల్

కు వ్యతిరేకంగా పోరు చేసిన కాకాణి తన స్ధానాన్ని ఆయనకు అప్పగించినట్లయింది. ఇప్పుడు కాకాణికి వ్యతిరేకంగా అనిల్ పోరు

ప్రారంభించారు. కాకాణి మంత్రి పదవి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందలేదని బహిరంగంగానే చెప్పేసిన అనిల్.. కాకాణి ప్రత్యర్ధుల్ని ఏకం

చేసే పనిలో పడ్డారనే ప్రచారం ఉంది.

ఇదీ చదవండి: ఇక సముద్రం చేప దొరకదు..? మత్స్యకారులకు ఆదాయం ఎలా..? ప్రభుత్వానికి ధరఖాస్తు ఎలా చేసుకోవాలి?

ముఖ్యంగా బీసీలతో పాటు రెడ్లలోనూ కాకాణికి ప్రత్యర్ధులున్నారు. వీరందరినీ ఇప్పుడు ఏకం చేసే పనిలో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్

యాదవ్ ఏకం చేసే పనిలో బిజీగా ఉన్నారని టాక్ ఉంది. కాకాణి బావ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ని తాజాగా అనిల్ యాదవ్ కలిశారు. ఇదే క్రమంలో జిల్లాలోని కాకాణి ప్రత్యర్ధులందరినీ ఆయన కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన వారందరినీ ముందుగా ఏకం చేసేందుకు అనిల్ పావులు కదుపుతున్నారంటూ ఓ వర్గం ప్రచారం చేస్తున్నారు. మరి ఈ కలయిక కేవలం కోటం రెడ్డితో ఆగుతుందా..? లేక కాకాణికి వ్యతిరేక నేతలను అందర్నీ కలుస్తారా అన్నది చూడాలి.

మంత్రి వ్యతిరేకులంతా నిజంగా ఏకమైతే.. జిల్లాలో వైసీపీపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది.  దీనిపై అధిష్టానం ఎలాంటి చర్యలు

తీసుకుంటుందో చూడాలి.  పట్టించుకోకుండా వదిలిస్తే.. వచ్చే ఎన్నికల్లో కాస్త నష్టం తప్పకపోవచ్చు..

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP cabinet, Ap cm jagan, AP News, Nellore, Ycp