Home /News /andhra-pradesh /

AP POLITICS YCP INTERNAL POLITICAL HEAT IN UNDI WEST GODAVARI DISTRICT NO COORDINATION BETWEEN LEADERS NGS

YCP Clashes: అధికార పార్టీ దూకుడికి ఆ జిల్లాలో స్పీడ్ బ్రేకర్లు.. సొంత నేతలే అడ్డుపడుతున్నారా..?

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

YCP Clasesh: అధికార వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా నేతలంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆ జిల్లాలో మాత్రం సొంత పార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారారు అని.. కేడర్ అనుమానిస్తోంది. ఇంతకీ ఆ జిల్లా వైసీపీ లో ఏం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  YCP Clasesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్ని జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ (YCP) అఖండ విజయం సాధించింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) ఒకటి.. కానీ ఆ జిల్లాలో ఇప్పుడు పలు నియోజకవర్గాల్లో వర్గపోరు రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్‌ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్‌ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజు (PVL Narasimha Raju)ను ఆ మధ్య ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించారు. మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో ఉండి వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటోంది కేడర్. వైసీపీ ఇంఛార్జ్‌గా అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు (Patapati Sarraju) ఉండేవారు. 2014లో ఓడిపోవడంతో.. 2019లో సర్రాజును కాదని.. పీవీఎల్ నరసింహారాజును బరిలో దించింది పార్టీ. ఆ మార్పూ వర్కవుట్ అవ్వలేదు. ఉండిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని భావించిన వైసీపీ పెద్దలు నరసింహారాజును తప్పించి.. గోకరాజు రామరాజు (Gokaraju Ramaraju) ను ఇంఛార్జ్‌గా నియమించారు. ఏమైందో ఏమో.. రామరాజును తప్పించి మళ్లీ నరసింహరాజును తెరపైకి తీసుకొచ్చింది పార్టీ. నియోజవకర్గంలో గ్రూపు తగదాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో పీవీఎల్‌కు మళ్లీ ఎందుకు పగ్గాలు అప్పగించారన్నది కేడర్‌ ప్రశ్న.

  వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించే.. గ్రామ కమిటీలలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా.. తనకు అనుకూలంగా ఉన్నవారికే నరసింహారాజు చోటు కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కమిటీలపై వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. ఉండిలో వైసీపీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజుకు క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. పీవీఎల్ నరసింహారాజు DCCB ఛైర్మన్‌ను చేశారు. నియోజకవర్గంలో గోకరాజు రామరాజు కుటుంబానికి పట్టు ఉంది ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా..?. ఇంతచేసినా ఉండిలో వైసీపీకి తేడా కొట్టడానికి కారణం సమన్వయ లోపానికి ప్రధాన కారణం సమన్వయ లోపమే అంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే కీలక పదవుల్లో ఉన్నారో ఆ నేతలు.. కేడర్‌ను చేరదీయకపోవడం.. కేడర్‌ విశ్వసించేలా పనులు చేపట్టకపోవడం పెద్దలోటు అంటున్నారు.  కేవలం ఇది ఈ ఒక్క నియోజకవర్గ సమస్య మాత్రమే కాదు.. దాదాన్ని అన్ని జిల్లాల్లోనూ చాలా నియోజ్వర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ వర్గపోరు బహిర్గతమైంది.ఇప్పటికే వైసీపీ రాష్ట కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు.. టీడీపీలో చేరారు.. ఇక గన్నవరంలో అయితే నిత్య పంచాయితీ తప్పడం లేదు.. కొత్తగా పార్టీ కోసం దూకుడుగా వెళ్తున్న వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా దుట్ట, యార్లగడ్డలు సహాయనిరాకరణ చేస్తున్నారు. ఇదే విషయాన్ని బహిరంగగానే అధిష్టానానికి చెప్పారు కూడా.

  ఇదీ చదవండి : పొత్తుల విషయంలో పవన్ ఒత్తిడిలో ఉన్నారా.. ఆ లైన్ దాటలేకపోతున్నారా?

  తాజాగా హిందూపురంలో అయితే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి కూడా.. హిందుపురంలో అది మరో లెవెల్ కు వెళ్లింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. శుక్రవారం ఉదయం కౌన్సిలర్ ఇర్షాద్ పై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు దాడి చేశారు. ఎమ్మెల్సీ తీరుని నిరసిస్తూ 18 మంది కౌన్సిలర్లు, చౌలూరి రామకృష్ణారెడ్డితో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ను ఎమ్మెల్సీ ఇక్బాల్, అతడి అనుచరులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. కౌన్సిలర్లపై ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు రాళ్లు రువ్వారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, TDP, West Godavari, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు