Home /News /andhra-pradesh /

AP POLITICS YCP INTERNAL FIGHT IN HINDUPUR MLC IQBAL AND NAVIN NISCHAL HI COMMAND SERIOUS ON LEADERS NGS

YCP Politics: వైసీపీలో ముదురుతున్న వర్గ పోరు.. పంచాయితీ తాడేపల్లికి చేరినా తీరని సమస్య? ఆ నేత పరిస్థితి ఏంటి?

అధికార పార్టీలో తారా స్థాయికి వర్గ విబేధాలు

అధికార పార్టీలో తారా స్థాయికి వర్గ విబేధాలు

YCP Politics: అధికార వైసీపీలో వర్గ పోరు కలకలం రేపుతోంది. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అని తేడా లేకుండా.. నేతల్లో విబేధాలు తెరపైకి వస్తున్నాయి. గన్నవరం, బందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి హిందూపురం కూడా చేరబోతోందా..?

ఇంకా చదవండి ...
  YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ.. గత ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించింది. కానీ మూడేళ్లు తిరిగే సరికి.. పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఢీ అండే ఢీ అంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎంపీలకు-ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ రాజు (MP Raghu rama Raju) రెబల్ గా తాయారు అయ్యారు. మరో ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. మరోవైపు తాజాగా బందరు, గన్నవరం పంచాయితీ (Gannavaram Politics) రోడ్డుపైకి వచ్చింది. మాజీ మంత్రి పెర్ని నాని (Ex Minster Perni Nani)పై ఎంపీ బాలసౌరి  (MP Balasouri) బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ వివాదం సద్దుమణగకముందే..?గన్నవరం రాజకీయాలు వేడి వేడిగా మారాయి. దుట్ట, యార్గగడ్డలు ఏమైనా మహేష్ బాబు, ప్రభాస్ లా అంటూ వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)  విమర్శలు చేస్తే.. అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు దుట్ట, యార్లగడ్డ.. ఆ వివాదం కొనసాగుతుండగానే.. సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది హిందూపురం (Hindupuram).

  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అసమ్మతి ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్‌ ఇక్బాల్‌. ఆయన మాజీ పోలీస్‌ అధికారి. ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. అయితే ఇక్బాల్‌ హిందూపురం వచ్చిన్పటి నుంచీ పార్టీలో అసమ్మతి కాక రేపుతూనే ఉంది అంటున్నారు.  2019 వరకు హిందూపురం వైసీపీకి అన్నీ తానై నడిపిన నవీన్‌ నిశ్చల్‌ను కాదని ఇక్బాల్‌కు ఎన్నికల్లో ఛాన్స్‌ ఇవ్వడంతో మొదలైన పంచాయితీ మూడేళ్లయినా సమసి పోలేదు. ఇక్బాల్‌ పెత్తనాన్ని సహించలేని నవీన్‌ నిశ్చల్‌ వర్గం యాంటీగా మారింది. ఇటీవల ఇక్బాల్‌ విదేశాలకు వెళ్లిన సమయంలో అసమ్మతి వర్గమంతా ఏకమైంది. కర్నాటకలోని ఒక రిసార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమై కలకలం రేపింది. తర్వాత అలాంటి మీటింగ్స్‌ హిందూపురంలోనూ జరిగినట్టు వైసీపీ వర్గాల టాక్. చివరకు అంతా కలిసి తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇక్బాల్‌పై ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో అసమ్మతి వర్గం ఇంకా స్పీడ్‌ పెంచింది.

  ఇదీ చదవండి : హీటెక్కిన గన్నవరం రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో వంశీకి సీటు ఇస్తే అంతే?

  విదేశాల నుంచి వచ్చాక హిందూపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పాల్గొంటున్నారు. ఈ ప్రొగ్రామ్‌కు నవీన్‌ నిశ్చల్‌ వర్గం దూరంగా ఉంటోంది. అంతా కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు చెప్పినా.. తమ పంచాయితీ తేలేవరకు గడప దాటేది లేదని తెగేసి చెబుతోంది ప్రత్యర్థి వర్గం. దీంతో ఇక్బాల్‌ కూడా అసమ్మతి నేతల తీరు.. చేష్టలపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా సహాయ నిరాకరణ పాటించినా.. ఈ దఫా మాత్రం గట్టిగా నిలబడంతో అసమ్మతివర్గం భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది.

  ఇదీ చదవండి : వృద్ధుడని కనికరం కూడా లేదా? ట్రాఫిక్ అంతరాయం పేరుతో విచక్షణా రహితంగా దాడి? ఏం జరిగిందంటే?

  ఇప్పటికే హిందూపురం వైసీపీలో క్యాంపు రాజకీయాలు జోరుగా ఉన్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి శంకర నారాయణ చొరవ తీసుకుని ఇక్బాల్‌, నవీన్‌ నిశ్చల్‌ వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ తగువు పార్టీ పెద్దలే తేల్చాలని అనుకుంటున్నారో ఏమో.. మాజీ మంత్రి చప్పుడు చేయడం లేదు. అయితే అసమ్మతి గ్రూపుకు తెరవెనక అండగా ఉన్న నవీన్‌ నిశ్చల్‌ .. జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపడం లేదంటున్నారు. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసినా.. అధిష్టానం ఎలాంటి చర్యలకు సిద్ధం కాకపోవడంతో.. కేడర్ అయోమయంలో పడ్డారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindupuram, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు