YCP Clashes: గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వైసీపీ గాలివీస్తే.. ఆ గాలికి ఎదురొడ్డి టీడీపీ (TDP) కి భారీగా పట్టం కట్టింది విశాఖ నగరం. సిటీలో నాలుగు స్థానాలను టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో విశాఖపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ చేసింది. కానీ వైసీపీ (YCP)లో కో-ఆర్డినేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. పశ్చిమ, దక్షిణ స్ధానాల్లో ఇంఛార్జుల పంచాయితీ చల్లారక ముందే.. తాజాగా తూర్పు నియోజకవర్గంలో తిరుగుబాటుకు చాప కింద నీరులా పెరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా (Visakha District)లో అధికారపార్టీకి తూర్పు నియోజకవర్గం చాలా కీలకం. ఎందుకంటే వరసగా మూడుసార్లు టీడీపీ ఇక్కడ గెలిచింది. 2019 ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం రచించినా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత జరిగి గ్రేటర్ ఎన్నికల్లోనూ అనుకున్న ఫలితాలు రాలేదు. ఇలా వైసీపీ అధిష్టానానికి చుక్కలు చూపించిన నియోజవర్గాల్లో విశాఖ ఈస్ట్ ఒక్కటి..
అక్కడి టీడీపీలో అంతర్గత బలహీనతలు బయటపడడంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోరాటం చేసేందుకు కొత్త వ్యూహం రచించింది. తూర్పు నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలుగా ముద్రపడ్డ యాదవులు, మత్స్యకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అక్కరమాని విజయనిర్మలకు కోఆర్డినేటర్ బాధ్యతలతోపాటు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్ పదవి అప్పగించింది.
ఇదే స్ధానం నుంచి రెండుసార్లు ఓడిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీని చేసింది. అలాగే విశాఖ మేయర్ పదవిని గొలగాని హరి వెంకట కుమారికి కట్టెబ్టటింది. ఈ విధంగా బలమైన బీసీ యాదవ సామాజికవర్గానికి గాలం వేసింది అధికారపార్టీ. ఇక అంతా సూపర్ అనుకుంటున్న సమయంలో.. క్షేత్రస్థాయి పరిస్థితిలు అధికార పార్టీకి షాక్ ఇచ్చింది.
ఇదీ చదవండి : చంద్రబాబు ఉంగరం వెనుక ఉన్న అసలు రహస్యం అదా..? పూర్తి క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధినేత
కో ఆర్డినేటర్‌గా అక్కరమాని విజయనిర్మల వర్గం వన్ సైడ్ గా వెళ్తోందనే వాదన చినికి చినికి గాలివానగా మారుతోంది. పార్టీలో సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసహనం ముదిరింది. ఆమెకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టే వరకు వెళ్లినట్టు టాక్. నియోజకవర్గ పరిధిలో జీవీఎంసీ 15 డివిజన్లు ఉండగా.. 11 చోట్ల వైసీపీ గెలిచింది. వీరిలో 10 మంది కార్పొరేటర్లు అక్కరమానిపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ ముసలం వెనక అసలు కారణం వచ్చే ఎన్నికల్లో తూర్పు టికెట్ కోసమే అని వైసీపీ వర్గాల్లో ఉన్న ప్రచారం.
ఇదీ చదవండి: ప్రధాని సభలో అంతా అద్భుతంగా నటించారు.. మరి అన్నయ్య చిరంజీవి..? నాగబాబు కామెంట్స్ వైరల్
గత ఎన్నికల్లో భీమిలికి చెందిన అక్కరమాని కుటుంబానికి తూర్పులో టికెట్ ఇచ్చింది వైసీపీ. వంశీకృష్ణ శ్రీనివాస్ టికెట్ ఆశించినా.. నిరాశే మిగిలింది. అప్పటి నుంచే అక్కమానికి.. వంశీకృష్ణకు విభేదాలు మొదలయ్యాయి. తూర్పు నియోజకవర్గంలో అక్కరమాని, వంశీకృష్ణ వర్గాల మధ్య అస్సలు పడటం లేదు. దానికితోడు కొద్దిరోజుల క్రితం పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్‌లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ తన మనసులోని మాటను చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు తెలిపారాయన.
ఇదీ చదవండి : ఇంత రాక్షస రాజకీయమా..? లేని వ్యక్తిని ఉన్నవాడిగా చూపించడం దారుణం.. చింతమనేని పైర్
దీంతో అక్కరమాని, వంశీ వర్గాలు ఢీ అంటే ఢీ అంటాయనుకుంటున్న సమయంలో మూడో వర్గం తెరపైకి వచ్చింది. మేయర్ హరికుమారి భర్త శ్రీనివాస్ సైతం రేస్‌లోఉన్నట్టు సంకేతాలు ఇవ్వడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఈ పరిణామాలు అక్కరమాని శిబిరానికి మింగుడు పడటం లేదట. ఇటీవల చేపట్టిన వార్డు అధ్యక్షుల నియామకాల్లో సిఫారసులను ఆమె పక్కన పెట్టేశారట. తమకు అనుకూలంగా ఉన్నవారికే పట్టం కట్టారట. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని.. మొదటి నుంచి వైసీపీలో పని చేస్తున్నవారికి కాకుండా.. కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారని అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి కోఆర్డినేటర్‌ను మార్చాలని కోరబోతున్నారట. ఈ తిరుగుబాట రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Vizag, Ycp