Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
YCP Clasesh: ఉమ్మడి కృష్ణా (Krishna)జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు.. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్(NTR) జిల్లాలో పార్టీకి చెందిన కీలక నేతల మాటలు వేడి పెంచుతున్నాయి. ముఖ్యంగా మైలవరం లో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) మధ్య ఆధిపత్యపోరు పీక్ కు చేరింది. అయితే ఈ ఇద్దరి మధ్య వర్గ పోరు చాలా కాలం నుంచే ఉంది. కానీ ఇటీవల ఓ సామాజిక వర్గంపై వైసీపీ సీనియర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు మరింత హాట్ గా ముదిరాయి. మధ్యలో అదే సమాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) కూడా ఎంటర్ అవ్వడంతో పరిస్తితి మరింత హీట్ పెంచింది. తన తండ్రిపై తీవ్ర విమర్శలు రావడంతో.. తనయుడు.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. దీంతో అధిష్టానం అలర్ట్ అయ్యింది.. ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యే మధ్య ముదిరిన పంచాయితీకి ఎండకార్డ్ వేయాలని భావించి.. క్యాంపు కార్యాలనకు పిలిపించింది..
తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గ వివాదం పై చర్చ జరిగిందని సమాచారం. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ వివరణ ఇచ్చారని.. అసలు వివాదానికి కారణం ఏంటి.. తనవైపు నుంచి ఎలాంటి తప్పులు లేవని ఆయన వెల్లడించినట్టు సమాచారం.
ఇదిలా వుంటే.. బుధవారం సజ్జలతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్లు, తదితర పరిణామాలను వివరించారు. అప్పుడే మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మీడియాతో మాట్లాడిన ఆయన తనను పార్టీలో కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారని, తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి కంప్లైంట్ చేశారు.
ఇదీ చదవండి : కీలక నేతలకు షాక్.. చెవిరెడ్డికి ప్రమోషన్.. సీఎం జగన్ఎ న్నికల టీం ఇదే
తాను పార్టీ మారతానని, మరో జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. కానీ తాను పోటీ అంటూ చేస్తే కచ్చితంగా మైలవరం నుంచే బరిలో ఉంటానని.. తాను లేతా తన కొడుకు జీవిత కాలం వైసీపీలోనే ఉంటామన్నారు. తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళానన్నారు. ఆధారాలతో సహా చూపించానన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అన్ని విషయాలు తీసుకుని వెళతానన్నారు. ఇతర విషయాలు పట్టించుకోవద్దు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేసుకోమ్మని సజ్జల సూచించారని నిన్ననే కామెంట్ చేశారు ఆయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jogi Ramesh, Ycp